అన్నీ తానై చూసుకోవాల్సినే భర్తే.. కాలయముడయ్యాడు. అనుమానం పెనుభూతమై.. ఆమె నిండు ప్రాణం బలిగొంది. అవును... అత్తింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు యత్నించిన ఘటన హైదరాబాద్ నగర శివారు రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో కలకలం రేపింది. సభ్య సమాజం సిగ్గుచేటుతో తలదించుకునే సంఘటన ఇది. జీవితంపైన ఆశలు చచ్చిపోయిన ఆ ఇల్లాలు చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతోంది... వివరాలిలా వున్నాయి...

 

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా, హయత్‌నగర్ సమీపంలో గల ఎల్లారెడ్డి కాలనీకి చెందిన కనకదుర్గ గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను వెంటనే సాగర్ రింగ్‌రోడ్డులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె మరణానికి సమీపంలో వున్నారు... 

 

కుటుంబసభ్యుల ఇచ్చిన కథనం ప్రకారం.. కనకదుర్గకు విజయ్‌కుమార్‌తో 2014లో వివాహమైంది. ఇటీవలే వారికి పాప పుట్టింది. అప్పటి నుంచి ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. ఆ పాప తనకు పుట్టలేదని భర్త వేధించగా.. ఆడపిల్లను కన్నావు పుట్టింటి నుంచి అదనపు కట్నం తీసుకురా అంటూ అత్త, ఇతర కుటుంబసభ్యులు ఆమెను తీవ్రంగా వేధించేశారు. దీంతో విసిగిపోయిన బాధితురాలు పురుగుల మందు తాగేసింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆమె కోలుకుంటోంది. 

 

విజయ్ బావ వసంతరాయలు అదనపు కట్నం తీసుకురావాలంటూ తీవ్రంగా వేధించేవాడని కనకదుర్గ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అతడివల్ల ప్రాణహాని ఉందని భయపడేదని చెబుతున్నారు. మరోవైపు తన చావుకు భర్త విజయ్‌కుమార్, అత్త లక్ష్మమ్మతో పాటు ఇతర కుటుంబసభ్యులే కారణమని ఆరోపిస్తూ కనకదుర్గ సూసైడ్ నోట్‌లో పేర్కొంది. ఈ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దాని ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఆమె కుటుంబ సభ్యులు వారికి జరిగిన అన్యాయానికి తగిన న్యాయం చేయాలని పోలీస్ శాఖ వారిని వేడుకోగా... తగిన న్యాయం చేస్తామని వారు మాటిచ్చారు

మరింత సమాచారం తెలుసుకోండి: