ఎన్నో రోజుల నుంచి తెలంగాణ రాజకీయాల్లో  ఐటీ శాఖ మంత్రి గులాబీ దళపతి ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వారసుడు  కేసీఆర్ కు సంబంధించి ఓ వార్త హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం పదవి నుంచి తప్పుకుని తన రాజకీయ వారసుడు కేటీఆర్ కి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్ట పోతున్నారని ప్రచారం జరిగింది. అయితే దీనికి సంబంధించి అటు టిఆర్ఎస్ నేతల నుంచి కూడా పలు సంకేతాలు కూడా వచ్చాయి. ఇప్పటికే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కేటీఆర్ కూ  అప్పజెప్పి తన తర్వాత పార్టీ కి తనంతటి వాడు తన వారసుడు కేటీఆర్ మాత్రమే అని చెప్పకనే చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్. క్రమక్రమంగా ఒక్కొక్క బాధ్యతను కేటీఆర్ అప్పగిస్తూ వస్తున్నారు. 

 


 మొన్నటికి మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పూర్తి బాధ్యతను కేటీఆర్ కు అప్పజెప్పారు కేసీఆర్. కేటీఆర్ నాయకత్వం లోని స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. అంతేకాకుండా ప్రత్యర్థి పార్టీల బలాలు ఏమిటి... ప్రజల్లో టిఆర్ఎస్ పార్టీకి ఉన్న బలాలు బలహీనతలు... ఇలాంటివి అన్ని తెలుసుకోవడానికి ఇప్పటికీ సీఎం కేసీఆర్ కేటీఆర్ కి పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. టిఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ కూ  పోటీదారులు అయిన హరీష్ రావును ఈ మధ్యకాలంలో కెసిఆర్ కాస్త దూరం పెడుతూ కేవలం ఆయన నియోజకవర్గానికే పరిమితం చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. 

 


 ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కి సంబంధించి కేటీఆర్ కు పూర్తి బాధ్యతలు అప్పగించినట్లు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పైపైన నిర్ణయాలు మాత్రమే కెసిఆర్ తీసుకుంటున్నారని...  కీలక నిర్ణయాలు మొత్తం కేటీఆర్ తీసుకుంటున్నారు అంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ఇప్పటికే అధికారం గానీ పవర్ గాని అన్ని కేటీఆర్ కు  వచ్చేశాయి. ఇక అధికారిక పట్టాభిషేకం మాత్రం ఒక్కటే మిగిలి ఉంది అంటున్నారు. అంతేకాకుండా కేసీఆర్ కేటీఆర్ కు సీఎం పదవి ఇచ్చిన తర్వాత దేశ రాజకీయాలపై దృష్టి పెట్టేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. చూడాలి మరి కేటీఆర్ కు సీఎం పదవి ఎప్పుడు తగ్గిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: