భారతీయ జనతా పార్టీ నాయకులపై తీవ్ర ఆరోపణలు చేసిన వైనం భోపాల్ వేదికగా జరిగింది. మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు దిగ్విజయ్‌ సింగ్‌ ఈ ఆరోపణలు చేశారు. బీజేపీ నాయకులు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.25కోట్ల నుంచి రూ.45కోట్ల లంచం ఇచ్చి వారిని లోబరుచుకునే ప్రయత్నంలో వున్నారని వారు తీవ్రంగా ఆరోపించారు.

 

IHG

 

బీహార్ రాష్ట్రంలో కమల్‌నాథ్‌ ప్రభుత్వాన్ని కూల్చి వేయడానికి, మాజీ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, నరోత్తమ్‌ మిశ్రా కుటిల రాజకీయాలు చేస్తున్నారని ఈ సందర్భంగా ఆరోపించారు. ప్రతి పక్షాన్ని జీర్ణించుకోవడం ఇష్టం లేని, భా.జ.పా నాయకులు, మానం, మర్యాద వదిలి... బహిరంగంగానే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని దిగ్విజయ్‌ పేర్కొంటున్నారు. అయితే ఎటువంటి పక్షంలో కూడా కాంగ్రెస్ నాయకులు ఎలాంటి ప్రలోభాలకు లోను కారని కూడా ఈ సందర్భంగా చెప్పారు.

 

ఇంకా.. వారి కుటిల వ్యూహ రచన ఈ రకంగా ఉందని కూడా అయన వివరించారు. అక్కడ ఎమ్మెల్యేలు ఏమైనా, తిరుగుబాటు చేసినట్లయితే మాత్రం... అప్పటికి అపుడు రూ.5కోట్లు, బలనిరూపణ సమయంలో మిగిలిన డబ్బును అందించనున్నట్లు బీజేపీ సంప్రదింపులు జరిపిన ఆధారాలు తమ వద్ద చాలా స్పష్టంగా ఉన్నాయని, నిరూపించగలమని దిగ్విజయ్‌ బల్లగుద్ది మరీ మాట్లాడారు. 

 

IHG

 

అయితే, మధ్యప్రదేశ్‌ని కర్ణాటకలా మార్చాలని చూస్తే మాత్రం చూస్తూ ఊరుకోబోమని, ఈ సందర్భంగా దిగ్విజయ్‌ సింగ్‌ వార్నింగ్ ఇచ్చారు. సరిగ్గా వన్ ఇయర్ క్రితం... 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 230 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ 109, కాంగ్రెస్‌ 114 స్థానాలను గెలుచుకోగా.. కాంగ్రెస్‌ పార్టీ నలుగురు స్వతంత్రులు, ఇద్దరు బీఎస్పీ, ఒక ఎస్పీ ఎమ్మెల్యే సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని అందరికి విదితమే.

మరింత సమాచారం తెలుసుకోండి: