మహిళ ఎంతో ఆనందంగా వివాహం చేసుకుంది... ఎన్నో ఆశలతో దాంపత్య జీవితం లోకి అడుగు పెట్టాలని అనుకున్నది... కానీ ఆ మహిళ ఆశలకు నిరాశే ఎదురైంది. పెళ్లయిన మొదటి రోజు నుంచే అత్త భర్త వేధింపులు మొదలయ్యాయి. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో తనను ఎంతగానో వేధించిన భర్త అత్త బావలు  కటకటాల పాలయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇండోర్ కు  చెందిన ఓ మహిళకు 2017 మే 4వ తేదీన వివాహం జరిగింది. దీంతో ఎన్నో ఆశలతో భర్తతో కలిసి హనీమూన్ వెళ్లేందుకు సిద్ధం అయింది ఆ నూతన వధువు. అయితే పెళ్లయిన మొదటి రోజు నుంచే అత్త వేధించడం మొదలు పెట్టింది. తన కోడలు కన్యో కాదో తెలుసుకోవడానికి... అత్త నీచానికి ఒడిగట్టింది. బాత్రూంలో తన ముందు బట్టలు విప్పి నిలబడాలంటూ  ఆదేశించింది. ఎందుకు అని కోడలు ప్రశ్నించగా నువ్వు కన్యనో కాదో తెలుసుకోవడానికి అంటూ అత్త చెప్పడంతో కోడలు షాక్కి గురైంది.

 


 అయితే అత్తయ్య ఇలా అడుగుతుంది అంటూ ఈ విషయాన్ని భర్త కు చెప్పగా పెద్దలు ఏం చేసినా మన మంచికే అంటూ జవాబిచ్చాడు భర్త.. దీంతో ఆ మహిళ ఆశ్చర్యానికి లోనైంది. ఇలాంటి ఇష్టం లేకున్నప్పటికీ అత్త  ముందు నగ్నంగా నిలబడి పరీక్షలో నెగ్గింది ఆ యువతి.ఆ తర్వాత భర్తతో కలిసి హనీమూన్ కి వెళ్ళింది. ఇక హనీమూన్లో ఇవన్నీ మర్చిపోయి భర్తతో ఎంతో సంతోషంగా గడుపుతున్న ఆ యువతి జీవితంలో మరోసారి రూపంలో అలజడి రేగింది. అంతేకాదు తన భర్తకు అన్న వరస అయ్యే వ్యక్తి అసభ్యంగా తాగుతూ లైంగిక వేధింపులకు పాల్పడడం మొదలుపెట్టాడు. ఈ విషయాన్ని అత్త వద్ద చెప్పిన ఆమె పట్టించుకోలేదు.

 

 అంతేకాదు ఏకంగా గది శుభ్రం చేసే నెపంతో స్వయంగా అత్త కోడలని పెద్దకొడుకు గదిలోకి పంపించింది.  ఇక అదే అదనుగా భావించిన ఆ యువతి బావ తలుపులు మూసేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై అత్త నిలదీయగా... ఆ యువతి ఖంగు తిని సమాధానం ఇచ్చింది అత్త. తన ఇద్దరు కొడుకుల సుఖపెట్టే అదృష్టం నీకు వచ్చిందని సంతోష పడు  అంటూ సమాధానం ఇచ్చింది. ఇక వీరి వేధింపులు రోజురోజుకు ఎక్కువ అవుతుండడంతో పుట్టింటికి వెళ్లిపోయింది ఆ మహిళ.  తనకు ఎదురైన చేదు అనుభవం గురించి తల్లిదండ్రులకు చెప్పలేక తనలో తానే కుంగిపోయింది. ఎంతకీ అత్త గారి ఇంటికి వెళ్లడానికి నిరాకరించడంతో తల్లిదండ్రులు నిలదీయగా అసలు విషయం చెప్పేసింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బాధిత మహిళ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కు  తీసుకెళ్లి ఫిర్యాదు చేయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలి భర్త బావ అత్త పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: