ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఎన్నో సంచలన పథకాలను ప్రవేశ పెట్టడంతో పాటు ప్రజా సంక్షేమానికి ఎన్నో కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటుంది. ఈ క్రమంలోనే  తీసుకున్న ఒక కీలక నిర్ణయం సంపూర్ణ మద్యపాన నిషేధం. ఇప్పటికే మద్యపాన నిషేధం విషయంలో మందుబాబులకు షాక్ ఇస్తూ వచ్చింది ఏపీ సర్కార్. ఇక తాజాగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎవరు మద్యాన్ని పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా ఉండేందుకు సంచలన నిర్ణయం తీసుకుంది. 

 

 రాష్ట్ర వ్యాప్తంగా 18 రోజుల పాటు మద్యం సరఫరా నిలిపి వేయాలంటూ జగన్మోహన్ రెడ్డి సర్కారు నిర్ణయించింది. మార్చి 12వ తేదీ నుంచి 29వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మద్యం దుకాణాలను మూసివేస్తున్నామని  అంటూ ఎక్సైజ్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఆయా రోజుల్లో మద్యం దుకాణాలకు మద్యం సరఫరాను కూడా నిలిపివేస్తామని అంటూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ... రాష్ట్రంలోని ఓటర్లపై ఎక్కడ మద్యం డబ్బు ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో జగన్ మోహన్ రెడ్డి సర్కారు ఈ  నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్పుకొచ్చారు. 

 


 అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు మద్యం ను పూర్తిగా నిరోధించాలని దృక్పథంతో... పంచాయతీరాజ్ చట్టం లో సవరణలు కోసం ఒక ఆర్డినెన్సును కూడా తీసుకు వచ్చాము... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  దీనికి సంబంధించి ఇదివరకే తెలిపారు అంటూ మంత్రి అనిల్ చెప్పారు.అయితే  స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా వోటర్లను ప్రలోభాలకు గురి చేసే విధంగా డబ్బులు పంచుతూ పట్టుబడిన లేదా మద్యం సరఫరా చేసిన.. ఇవన్నీ చేసినట్లు ఎన్నికల తర్వాత నిరూపణ అయినా  అనర్హత వేటువేస్తాము  అంటూ వార్నింగ్ ఇచ్చింది  జగన్ సర్కార్. ఇలా నిబంధనలకు విరుద్ధంగా చేసిన వారికి 3 ఏళ్ల జైలు శిక్ష కూడా పడుతుందని సీఎం జగన్ గతంలో స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీలు అందరూ ఎప్పుడూ అలర్ట్ గా ఉండి  ప్రచారంలో ఎలాంటి మద్యం డబ్బు పంచకుండా అరికట్టాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో  ఎక్కడ డబ్బు మద్యం అనే మాట కూడా రాకూడదంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికలు ఏమో కానీ ఈ నిర్ణయం వల్ల అటు మందుబాబులకు మాత్రం భారీ షాక్ తగిలినట్లయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: