ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఎట్టకేలకు భారతదేశంలో కూడా అడుగు పెట్టి అందర్నీ భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఉన్నఫలంగా చాలామంది ఆఫ్ లైన్ ఉద్యోగులు తమ జాబ్ లకు రిజైన్ చేసి ఆన్లైన్ ఉద్యోగాలలో చేరారంటే కరోనా ప్రభావం భారత దేశ ప్రజలపై ఎంత తీవ్రంగా ఉందో ఊహించుకోవచ్చు. ఇరాన్ దేశంలో కూడా కరోనా వైరస్ వలన 237 మంది చనిపోగా 7000మందికి ఈ వైరస్ సోకింది. దాంతో ఇరాన్ దేశంలో ఉన్న రెండువేల భారతీయుల కుటుంబాలను ఇండియాకి రప్పించేందుకు కేంద్రం అనేక చర్యలు తీసుకుంటుంది. మార్చి 9వ తేదీన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు తెహ్రాన్ లో ల్యాండ్ అయ్యి భారతీయులను ఇండియాకు తీసుకురావడానికి చర్యలు చేపట్టారు.

 

 

ఇది ఇలా ఉండగా... అమెరికాలో, బ్రిటన్ లో కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూ వస్తోంది. ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ లో కరోనా వైరస్ మూడు వందల మందికి పైగా సోకగా ఇప్పటి కే ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఇంకో విస్తుపోయే నిజమేమిటంటే... మంగళవారం నాడు యునైటెడ్ కింగ్డమ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నాడిన్ డోరిస్ కు చేసిన వైద్య పరీక్షలలో కరోనా వైరస్ పాజిటివ్ అని వచ్చింది. దీంతో ఒక్కసారిగా నిర్గాంతపోయిన ఆమె తర్వాత తేరుకొని ఒక ప్రకటన జారీ చేసింది.



ఆ ప్రకటనలో... 'నేను చేయించుకున్న వైద్య పరీక్షలలో కరోనా వైరస్ పాజిటివ్ అని వచ్చింది. ఇంగ్లాండ్ డాక్టర్ల సలహాల మేరకు ప్రస్తుతం నేను ఇంట్లోనే ఒక ప్రత్యేక గదిలో ఒంటరిగా ఉంటూ మెరుగైన చికిత్స ని పొందుతున్నాను' అని డోరిస్ పేర్కొంటూ కరోనా వైరస్ ని జయించడం  తేలికేనని చెప్పకనే చెప్పేశారు.




ఇకపోతే నాడిన్ డోరీస్ 2019 నుండి స్టేట్ ఫర్ హెల్త్ అండ్ సోషల్ కేర్ పార్లమెంటరీ అండర్ సెక్రటరీ గా బాధ్యతలను నిర్వహించారు. ఐతే ప్రస్తుతం యునైటెడ్ కింగ్డం లో కరోనా వైరస్ సోకిన తొలి ప్రజాప్రతినిధిగా డోరీస్ వార్తలలో నిలుస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: