ఇప్పటికే తెలుగుదేశం పరిస్థితి దయనీయంగా తయరైంది. పాపం.. కేవలం 23 ఎమ్మెల్యేలు మాత్రమే ఆ పార్టీ నుంచి గెలిచారు. అందులోనూ ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటికే దూరమయ్యారు. దీంతో స్కోరు.. 21కి పడిపోయింది. ఇప్పుడు కరణం బలరామ్ కూడా అదే జాబితాలో చేరారు. దీంతో బాబు స్కోరు 20 కే పరిమితం అయ్యింది. అయితే ఇలాంటి సమయంలో వైసీపీ ముఖ్యనేత ramakrishna REDDY' target='_blank' title='సజ్జల రామకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సజ్జల రామకృష్ణారెడ్డి ఓ షాకింగ్ న్యూస్ బయటపెట్టారు.

 

 

అదేంటంటే... టీడీపీకి చెందిన 13 నుండి 17 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ramakrishna REDDY' target='_blank' title='సజ్జల రామకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. వీరంతా స్వచ్చంధంగానే వైసీపీలో చేరేందుకు తమ పార్టీతో చర్చిస్తున్నారట. అంతే కాదు.. రానున్న రోజుల్లో మరిన్ని వలసలు టీడీపీ నుండి తమ పార్టీలోకి ఉంటాయని సజ్జల రామ కృష్ణారెడ్డి తేల్చి చెప్పారు. అంటే ఇక చంద్రబాబు స్కోరు సింగిల్ డిజిట్ కు పడిపోయే అవకాశం ఉందన్నమాట.

 

IHG

 

అంటే చంద్రబాబు కాకుండా ఆయనతో పాటు మరో ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలు తప్ప అంతా వైసీపీ వైపే చూస్తు న్నారన్నమాట. టీడీపీ మునిగిపోతోందని చాలా మందికి అర్థమైంది కాబట్టే తమ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపు తున్నారని ramakrishna REDDY' target='_blank' title='సజ్జల రామకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మరోవైపు ఏపీ కోటాలో అంబానీ మిత్రుడు నత్వానీకి రాజ్యసభ సీటు ఇవ్వడంపై టీడీపీ చేస్తున్న విమర్శలపైనా ఆయన స్పందించారు.

 

 

ఏపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం నత్వానీకి రాజ్యసభ టిక్కెట్టును కేటాయించామని సజ్జల అన్నారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని నత్వానీ హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన తెలిపారు. అంతే కాదు.. సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్ రావు, కనకమేడల రవీంద్రకుమార్ లాంటి వాళ్లకు రాజ్యసభ టిక్కెట్లు ఇచ్చిన టీడీపీ తమను విమర్శించే హక్కు లేదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. అసలు ఇప్పుడున్న టీడీపీ ఎన్టీఆర్ పెట్టిన పార్టీయే కాదన్నారు సజ్జల.

 

మరింత సమాచారం తెలుసుకోండి: