ముల్లును ముల్లుతోనే తీయాలని జగన్మోహన్ రెడ్డి తాజాగా నిర్ణయించినట్లు పార్టీ వర్గాల సమాచారం. రాజకీయాల్లో నీతి, నిజాయితి అని మడికట్టుకుని కూర్చుంటే కుదరదని అందులోను చంద్రబాబునాయుడు  ముందు అసలు పనికిరాదని జగన్ కు ఇపుడు బాగా అర్ధమైంది. అందుకనే తొందరలోనే  చంద్రబాబును లేవకుండా దెబ్బ కొట్టాలని డిసైడ్ అయ్యాడని సమాచారం. గడచిన పది మాసాల్లో టిడిపి ఎంఎల్ఏలు ఎంతమంది వచ్చి పార్టీలో చేరుతామని ఒత్తిడి పెడుతున్నా వద్దని వాళ్ళని పట్టించుకోవటం లేదు.

 

చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు జగన్ ను రాజకీయంగా దెబ్బ కొట్టాలని ఫిరాయింపులకు ఎంతగా ప్రయత్నించాడో అందరికీ తెలిసిందే. వైసిపి అధికారంలోకి రాగానే జగన్ కూడా అదే బాటలో నడిచుంటే ఈపాటకి అసెంబ్లీలో టిడిపి దుకాణం కట్టేసుండేవారే. కానీ జగన్ ఆ దిశగా ఆలోచించ లేదు. తాను కూడా అలాగే ఆలోచిస్తే తనకు చంద్రబాబుకు తేడా ఏముంటుందని అనుకున్నాడు. నీతిమంతమైన రాజకీయాలను చేస్తానని చెప్పాడు.

 

అయితే జగన్  ఆలోచనను చంద్రబాబు అవకాశంగా మలచుకుంటున్నాడు. నిజానికి జగన్ నిర్ణయానికి చంద్రబాబు కృతజ్ఞత చూపించాలి. అనవసర విషయాల్లో రాద్దాంతం మానేసి కాస్త హుందాగా ఉండాలి. కానీ తాజాగా స్ధానిక సంస్ధల ఎన్నికలను వాయిదా వేయించటంలో తెర వెనుక నుండి చేసిన కంపు అందరికీ అర్ధమైపోయింది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా గొడవలు జరగటం మామూలే. అలాగే ఇపుడు కూడా అక్కడకక్కడ గొడవలు జరుగుతున్నాయి.

 

ఒకవైపు టిడిపి వాళ్ళే గొడవలు చేస్తు, తమ పార్టీ వాళ్ళపై వాళ్ళే ఉత్తుత్తి గొడవలు చేసుకుంటూ దాన్ని వైసిపి నేతలకు ఆపాదించి జనాల్లో పార్టీని గబ్బు పట్టించే పని చేస్తున్నారు. ఈ గొడవలన్నింటికీ పరాకాష్టగా రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను మ్యానేజ్ చేసి చివరకు ఎన్నికలనే వాయిదా వేయించాడు. దాంతో జగన్ ఇపుడు చంద్రబాబు మీద మండిపోతున్నాడు. ఈ నేపధ్యంలోనే అసెంబ్లీలో అసలు చంద్రబాబును నేలమట్టం చేసేయాలని డిసైడ్ అయ్యాడట.

 

అంటే వైసిపిలోకి రాదలచుకున్న టిడిపి ఎంఎల్ఏలను నేరుగా చేర్చేసుకోవటమో లేకపోతే వాళ్ళతో ఎంఎల్ఏ పదవులకు రాజీనామాలు చేయించటమో చేసి ఉపఎన్నికల్లో చంద్రబాబును పూర్తిగా దెబ్బ కొట్టేయాలని అనుకున్నాడు. దీని వల్ల చంద్రబాబుకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఎగిరిపోతుంది. అదే సమయంలో శాసనమండలి కూడా రద్దు చేయిస్తే చంద్రబాబును రెండు రకాలుగాను దెబ్బ కొట్టినట్లవుతుందని డిసైడ్ అయ్యాడట. మరి ముహూర్తం ఎప్పుడున్నదే తేలాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: