ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మన పక్క దేశమైన పాకిస్థాన్ కి కూడా సంక్రమించింది. ఇప్పటికే 195 మంది పాకిస్తాన్ దేశీయులకు కరోనా వైరస్ సోకగా... ఈరోజు అనగా మార్చి 17న తొలిసారిగా ఒక వ్యక్తి కోవిడ్ 19 వ్యాధి చికిత్స పొందుతూ చనిపోయాడని పాకిస్తాన్ ఆరోగ్యశాఖ తెలియజేసింది. కరోనా వైరస్ వ్యాప్తిని ప్రతి నిమిషం తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఓపెన్ చేసిన ఒక వెబ్ పోర్టల్ లో పాకిస్తాన్ ఆరోగ్య మంత్రి శాఖ తమ దేశంలో సంభవించిన మరణం గురించి తెలియపరిచింది. 

 


పంజాబ్ హెల్త్ మినిస్టర్ యాస్మిన్ రషీద్ చెప్పిన ప్రకారం... హఫీజబాద్ కు చెందిన ఒక వ్యక్తి కొన్ని రోజుల క్రితం ఇరాన్ నుంచి తన స్వదేశమైన పాకిస్థాన్ కి తిరిగి రాగా, తనకు కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు తెలిసింది. దాంతో ఇరాన్–టాఫ్టాన్‌ సరిహద్దుల్లో అతడిని ఉంచి ఎవరికీ కాంటాక్ట్ అవ్వకుండా 14 రోజుల పాటు కరోనా వైరస్ సంబంధిత చికిత్సను అందించారు. కానీ అక్కడ అతడి ఆరోగ్యం రోజు రోజుకి దారుణంగా క్షీణిస్తుండంతో వెంటనే పాకిస్థాన్ లోని లాహోర్ కి తరలించారు. లాహోర్ లోని మయో ఆసుపత్రిలో కోవిడ్ 19 వ్యాధిగ్రస్తుడిని చేర్పించి ఐసోలేషన్ వార్డులో అతనికి చికిత్సను అందిస్తుండగా... మంగళవారం మంగళవారం రోజు అతడి పరిస్థితి విషమంగా మారి చివరికి చనిపోయాడు. 

 

 


ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా 7007 మంది కరోనా వైరస్ బారినపడి మృత్యువాత పడ్డారు. మన దేశంలో కూడా కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే మధుర చనిపోయారు. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సత్వర చర్యలు తీసుకుంటూ కరోనా వైరస్ వ్యాప్తిని అంతమొందించేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 31వ తేదీ వరకు విద్యాసంస్థలను, సినిమా హాల్ లో పెళ్లి మండపాలను, ప్రజల గుంపులుగా ఏర్పడటాన్ని నిషేధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: