కరోనా వైరస్ చైనాలోని వుహాన్ పుట్టి అన్ని దేశాలకు విస్తరించిందని విషయం విదితమే. అయితే.. చైనాలో మూడు నెలల ముందు విజృంభించి ముప్పుతిప్పలు పెట్టిన వైరస్ చైనాలో తగ్గుముఖం పడుతుందనే విషయం తెలిసిందే.. అయితే చైనా తమ దేశంలో మూడు నెలలనుంచి మొదటిసారిగా కరోనా వైరస్ కేసు ఒక్కటి కూడా నమోదుకాలేదని ఆ దేశ ప్రభుత్వం గురువారం వెల్లడించింది. 


దీంతో అక్కడి ఆర్ధిక వ్యవస్థపై కరోనా వైరస్ పెను ప్రభావం చూపుతుంది. ఈ విషయంలో చైనా కీలక మైలురాయిని చేరుకుందని చెప్పాలి. వివిధ దేశాలకు వైరస్ ను విస్తరింపజేసింది. ఐటీ కోవిడ్‌ తీవ్రత వలన ఇటలీ, ఇరాన్ అమెరికా లాంటి దేశాలలో ఈ మహమ్మారి బరిలో పడి అక్కడ మరణమృదంగం మోగుతుంది. కానీ.. చైనా మాత్రం వైరస్‌ ను సమర్ధంగా నిరోధించి, లక్ష్య సాధనలో విజయాన్ని అందుకుంటుంది. 


కానీ చైనా వెల్లడించిన గణాంకాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. బుధవారం 34 కరోనా వైరస్ కేసులు నమోదైనా, వీరంతా విదేశాల నుంచి వచ్చినవారేనని అధికారులు గురువారం ప్రకటించారు. తప్పుడు గణాంకాలు వెల్లడిస్తే దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని అంటున్నారు విశ్లేషకులు. ఈ వైరస్ వాస్తవాలను చైనా మొదట దాచిపెట్టి అలసత్వం వహించడంతో ఇంత భయానకంగా విజృంభించిందంటున్నారు. అలసత్వం వహించటంతో అక్కడి ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. దీంతో ప్రభుత్వం చర్యలకు పూనుకుని మిలియన్ల మందిని ఇళ్లకు పరిమితం చేసి, ప్రజా రవాణాను నిలిపివేసింది.


 అయినా కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉండటంతో 
ఆర్థికంగా తీవ్ర నష్టపోయారు. కానీ.. కరోనా నుంచి చైనాకు పూర్తిగా ముప్పు తొలగిపోలేదు. అసలు ఈ వైరస్ ను నిర్ములుంచే శక్తి లేదు. అది ఏ దేశానికి సాధ్యం కాదు. ఒకవేళ మళ్ళీ కరోనా  విస్తరిస్తే ఎలా అనే ప్రశ్న ఇప్పుడు ముందుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: