చంద్రబాబునాయుడు ఇప్పుడు కూడా చవకబారు రాజకీయాలు మానటం లేదు. ఒకవైపు తాను సిఎం అనో లేకపోతే ప్రధానమంత్రి అనో అనుకుంటున్నట్లున్నాడు. అందుకనే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జాతిని ఉద్దేశించి మాట్లాడాడు. సరేలే ఏదో మీడియా ప్రచారానికి అలవాటు పడిపోయిన ప్రాణం కాబట్టి ప్రచారం లేకపోతే బతకలేడని సరిపెట్టుకోవచ్చు. అయితే తన మానాన తాను జాతికి సందేశం ఇచ్చి ఊరుకోకుండా ప్రభుత్వంపై చవకబారు ఆరోపణలు చేశాడు.

 

తాను ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తునే మరోవైపు ప్రభుత్వమే కరోనా వైరస్ పై రాజకీయాలు చేస్తోందంటూ ఆరోపణలకు దిగారు. ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టి గంటల తరబడి మీడియా వాళ్ళు బుర్రలు తింటు ప్రభుత్వంపై చీప్ గా ఆరోపణలు చేస్తున్నదే చంద్రబాబు. ఎటూ చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నాడు కాబట్టి మిగిలిన నేతలు కూడా పదే పదే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే.

 

వైరస్ వ్యాపించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని, అనుమానితులను క్వారంటైన్ సెంటర్లకు పంపటంలో ఆలస్యం చేసిందని, అనుమానితులకు పరీక్షలు చేయించటంలో నిర్లక్ష్యం వహించిందని అంటూ నోటికొచ్చినట్లు ఆరోపణలు చేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఇటువంటి సమయంలో ప్రభుత్వం రాజకీయాలు చేయటం తగదని అంటూనే రాజకీయం చేయాలంటే తాము కూడా చేయగలమని జగన్ ను రెచ్చగొడుతుండటమే విచిత్రంగా ఉంది.  

 

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు తన స్ధాయికి తగ్గట్లు మాత్రం వ్యవరించటం లేదని తెలిసిపోతోంది. గడచిన పది నెలల్లో ఏ విషయం తీసుకున్నా ఇదే వరస. ప్రతి చిన్న విషయాన్నీ బూతద్దంలో చూపటం జగన్ పై ఎంత వీలుంటే అంతా బురద చల్లేయటంతోనే తన కసినంతా తీర్చుకుంటున్నాడు. తాను ఏం మాట్లాడినా అచ్చేసొదిలే పచ్చమీడియా ఉంది కాబట్టే నోటికొచ్చినట్లు మాట్లాడేస్తున్నాడు. నిజానికి కరోనా వైరస్ లాంటి సమస్యల నుండి బయటపడటానికి చంద్రబాబు ప్రభుత్వానికి సూచనలు ఇవ్వటంలో తప్పే లేదు. కాకపోతే హుద్ హూద్ తుపానప్పుడు తాను తీసుకున్న చర్యలన్నింటినీ ఏకరువు పెట్టడంతోనే రాజకీయం ఎవరు చేస్తున్నారో అర్ధమైపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: