ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా గొప్పలు చెప్పుకునే అమెరికాలో ఇప్పుడు ఎక్కడ చూసిన తీవ్ర ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఎటు చూసినా అయోమయం కనిపిస్తోంది. ఏడుపులు పెడబొబ్బలు వినిపిస్తున్నాయి. ప్ర‌తి అమెరికన్ పౌరుడు కూడా జీవితం పై ఆశలు వదిలేసుకుని తాము ఎన్నిరోజులు బతుకుతామో తెలియదన్నట్టుగా ఆందోళనలో రోజులు వెళ్లదీస్తున్నారు. రేపు ఉదయం తెల్లవారితే తమ బతుకు తాము లేదో తనకు తెలియదని చాలామంది అమెరికన్లు సోషల్ మీడియాలో మెసేజ్‌లు పెడుతున్నారు.

 

దీనిని బ‌ట్టే  అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా అమెరికా పరిస్థితి విషమంగా మారింది. కంట్ర‌ల్ త‌ప్పేశాక‌ ఇప్పుడు కఠిన చర్యలు అమలు చేస్తున్నా పరిస్థితి మాత్రం అదుపులోకి రావడం లేదు. ఇక సోమవారం ఉదయం వరకు అమెరికాలో అప్డేట్స్ పరిశీలిస్తే ఇప్ప‌టికే అక్క‌డ క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1, 41, 818 గా ఉంది. ఇక ఇట‌లీని మించిపోయేలా అమెరికాలో 17500 మంది మృతిచెందారు. చివ‌ర‌కు అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి విధించినా కూడా ప‌రిస్థితి అదుపులోకి రాక‌పోవ‌డాన్ని బ‌ట్టి చూస్తే అమెరికాలో ఏకంగా త్వ‌ర‌లోనే 50 వేల మంది మృతి చెందుతార‌ని అప్ప‌ట‌కి వీళ్లు క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌కపోతే వీరి సంఖ్య ల‌క్ష దాటుతుంద‌ని అంటున్నారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: