క‌రోనా బాధిత రాష్ట్రాల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ నిన్న‌టి వ‌ర‌కు కాస్త సేఫ్‌లో ఉంద‌ని అంద‌రూ అనుకున్నారు. క‌రోనా ప‌క్క రాష్ట్ర‌మైన తెలంగాణ‌లో జోరుగా ఉన్నా ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌రిస్థితి ఒక్క‌సారిగా సీరియ‌స్ అయ్యింది. సోమ‌వారం వ‌ర‌కు కూడా 530 మందికి ప‌రీక్ష‌లు చేస్తే కేవ‌లం 23 మందికి మాత్ర‌మే  పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ప‌రిస్థితి అంతా కంట్ర‌ల్లోనే ఉంద‌ని అంద‌రూ అనుకున్నారు.

 

అయితే మంగ‌ళ‌వారం ఉద‌యంతో ప‌రిస్థితి ఒక్క‌సారిగా అదుపు త‌ప్పేసింది. ఏపీ నుంచి ఢిల్లీ ప్రార్థ‌న‌ల‌కు వెళ్లిన వారిలో ఏకంగా 711 మంది ఉన్నార‌ని తెలియ‌డంతో వీరికి ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తుండ‌గా చాలా మందికి పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. కొత్త‌గా అనంత‌లో 2, ప్ర‌కాశంలో 8, కృష్ణా, తూర్పు గోదావ‌రి జిల్లాల్లో ఒక్కోటి చోప్పున క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.

 

ఇక అనంత‌పురం జిల్లాలో 10 ఏళ్ల బాలుడు సైతం క‌రోనా భారిన ప‌డ్డాడు. ఇక ఢిల్లీ ప్రార్థ‌న‌ల‌కు వెళ్లిన వారితోనే చాలా మందికి క‌రోనా పాకింద‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మొత్తం 711 మంది ఢిల్లీ వెళ్లార‌ని తెలియ‌డంతో వీరిలో అస‌లు ఎంత మందికి క‌రోనా సోకిందో అర్తం కావ‌డం లేదు. ఇక ఈ రోజు ప్ర‌కాశం జిల్లాలో 8 పాజిటివ్ కేసులు ఉండ‌డంతో ఈ కేసులు మొత్తం 11కు చేరుకున్నాయి. ఇక గుంటూరు జిల్లాలో 6 పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఈ రెండు జిల్లాల్లో ఒక్క‌సారిగా హై ఎలెర్ట్ నెల‌కొంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: