మహమ్మారి కరోనా వైరస్ మన భారత్ కు వచ్చి, నేటికి సరిగ్గా రెండు నెలలు కావస్తోంది. మొదటి కేసు ఫిబ్రవరి 1న నమోదు అయ్యిందని అందరికి తెలిసినదే కదా. కాగా, ప్రస్తుతం ఇండియా, 1252 కరోనా పాజిటివ్ కేసులను దాటి... ఎక్కువ కేసులు నమోదైన 42 దేశాల సరసన చేరిపోవడం.. ఇపుడు సర్వత్రా టెన్షన్ మొదలయ్యింది. ప్రస్తుతం లాక్ డౌన్ పొడిగింపు విషయంలో కూడా అందరికీ ఒకింత టెన్షన్ ఉండటం సహజమే.

 

ప్రస్తుత పరిస్థితులలో ఈరోజు నుండి.. రాబోయే 14 రోజులు వరకు మనకు అత్యంత కీలకం కానున్నాయి ఎందుకంటే కరోనా వేగం యొక్క తీవ్రతను బట్టి వైద్య ప్రముఖులు ఓ అంచనాకు వచ్చి... రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు ఓ క్లారిటీ ఇవ్వనున్నారు. ప్రస్తుతం మన దగ్గర కేసులు.. త్వరిత గతిన నమోదు అవుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ పెంచినా.. ఆశ్చర్యం పడనవసరం లేదు!

 

ప్రత్యేకించి మన దగ్గర తీసుకుంటే.. మన దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,252కు చేరుకోగా, 33 మంది మృతి చెందారు. నిన్న అనగా, సోమవారం మార్చ్ 30న మన దగ్గర 227 పాజిటివ్‌ రావడం ప్రస్తుతం అందరిలోనూ వివిధ రకాల భయాందోళనలు నెలకొన్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 230; కేరళలో 222; ఢిల్లీలో 97; కర్ణాటకలో 88; గుజరాత్‌లో 70; తమిళనాడులో 74; తెలంగాణలో 78; రాజస్తాన్‌లో 76; ఆంధ్రప్రదేశ్ లో 40 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే...

 

ప్రపంచలో మొత్తం కేసులు: 8, 01 , 061
మరణాలు: 38, 748
రికవరీ కేసులు: 1, 69, 993

 

ఇండియాలో మొత్తం కేసులు: 1, 252 
మరణాలు: 40 
కొత్త కేసులు: 51
రికవరీ కేసులు: 105 

 

తెలంగాణలో మొత్తం కేసులు: 78
మృతులు: 6 
కొత్త కేసులు: 1 
యాక్టివ్ కేసులు: 61 
డిశ్చార్జి కేసులు: 14
ఏపీలో మొత్తం కేసులు: 40
మృతులు: 1 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple: https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: