కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం. దాంతో అందరు ఇళ్లకు పరిమితమయ్యారు. లాక్ డౌన్ కారణంగా చాలామంది ఇండ్లలో ఉండటం వల్ల కొంతలో కొంత కరోనా ని కట్టడి చేయవొచ్చని వైద్యులు అంటున్నారు. ఈ కరోనా  మహమ్మారిని అంతం చేసే పరిశోధనలకు నిధులు కేటాయిస్తూనే.. అంటువ్యాధి ప్రబలకుండా లాక్‌డౌన్‌ విధిస్తున్నాయి. కేవలం నిత్యావసరాల కోసం మాత్రమే బయటకు వెళ్లే వెసలుబాటును కల్పిస్తున్నాయి.

 

ఈ క్రమంలో కొంతమంది ఆకతాయిలు ఉద్దేశపూర్వకంగానే లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమిస్తూ పోలీసుల చేతికి చిక్కుతున్నారు. అలాంటి వారిని దేశ వ్యాప్తంగా పోలీసులు ఎన్నో రకాలుగా కట్టడి చేస్తున్నారు.  అయితే మన దేశంలో ఎలా చేసిన కొన్ని దేశాల్లో లాక్ డౌన్ ఉల్లంఘన శిక్షలు చూస్తు గుండె గుభేల్ అంటున్నాయి.  లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిని ఫిలిప్పైన్స్‌లో అరెస్టు చేసి.. హింస పెడుతున్నారంటూ మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.  లాక్ డౌన్ ఉల్లంఘించిన వారిని పెద్ద నేరస్తులుగా భావిస్తున్నారు.  ఒకదశలో కుక్కల బోన్లలో బంధించడం.. ఎర్రటి ఎండలో కూర్చోబెట్టడం వంటి అమానుష చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

 

ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేస్తు మహమ్మారిని వ్యాప్తి చేస్తున్న వారిని కాల్చి చంపేందుకు కూడా వెనుకాడవద్దని దేశ అధ్యక్షుడు రోడ్రిగో పోలీసులు, మిలటరీ అధికారులను ఆదేశించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.   మెక్సికోలో ఇక లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రాంక్‌ కాల్స్‌ చేసి విసిగించిన వారికి 600 డాలర్ల జరిమానా విధిస్తామని పెరూ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.  హాంగాంగ్ లో క్వారంటైన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హాంగ్‌కాంగ్‌ ప్రభుత్వం ప్రకటించింది. 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: