కరోనా వైరస్ కారణంగా అనేక రంగాలు కుదేలవుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థే ఛిన్నాభిన్నం అవుతోంది. ఈ నేపథ్యంలో మీడియా రంగంపైనా కరోనా ప్రభావం గణనీయంగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రత్యేకించి ప్రింట్ మీడియాపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కరోనా సమయంలో పత్రికల్లో చాలా మార్పులు వచ్చేశాయి.

 

 

అన్ని పత్రికలు పాఠకులను చేరడం లేదు. పత్రికలను పాఠకుల ఇళ్లకు చేరవేసే బోయ్‌లు చాలా చోట్ల కరోనా భయంతో మానేశారు. కొన్ని పత్రికలు మాత్రం తమ సొంత నెట్‌ వర్క్‌తో పాఠకుల ఇళ్లకు పత్రికలను చేర్చగలుగుతున్నాయి. మరికొన్ని పత్రికలు ఏకంగా మా డిజిటల్ కాపీ ఉచితంగా చదువుకోండి అంటూ నేరుగా పాఠకుల మొబైళ్లకే సందేశాలు పంపిస్తున్నాయి.

 

 

ఈనాడు వంటి అగ్రశ్రేణి పత్రికలు కూడా టాబ్లాయిడ్‌ ను ఆపేశాయి. ఆ మేరకు మెయిన్‌ పేజీలో రెండు పేజీలు కేటాయిస్తున్నాయి. ఈ సమయంలో గమనించాల్సిన విషయం ఏంటంటే వార్తల పట్ల ఆసక్తి ఉన్నవారు డిజిటల్ మీడియాకు మళ్లుతున్నారు. అసలే కరోనా భయం.. అందులోనూ పత్రిక తయారీలో ఎన్నో చేతులు మారుతుంది. ఎందుకొచ్చిన గొడవ అంటూ ప్రింటు కాపీలు పట్టుకునేందుకు జనం భయపడుతున్నారు.

 

 

అబ్బే పేపర్ ద్వారా కరోనా రాదు సుమా అని ఇవే పత్రికలు ఎంత ప్రచారం చేస్తున్నా.. అంతగా ఫలితం కనిపించడం లేదు. ఇదే సమయంలో ఇవే పత్రికల డిజిటల్ కాపీలకు జనం అలవాటు పడుతున్నారు. అవి ఉచితంగా లభించడం విశేషం. ఈ నేపథ్యంలోనే పత్రికలకు కొత్త బెంగ పట్టుకుంది. జనం ఇలా డిజిటల్ కాపీలకు అలవాటు పడిపోతే ఎలా.. రేపు కరోనా తగ్గిపోయినా మార్కెట్లో పేపర్ కొని చదివే పాత అలవాటుకు జనం వస్తారా లేదా.. ఈ డిజిటల్ కాపీలే బావున్నాయిలే ఎందుకు నెలకు రూ. 300 దండుగ అని పేపర్ కొని చదవడం మానేస్తారా అన్న బెంగ పట్టుకుంది. అదే జరిగితే ఆ నష్టం ఎలా పూడ్చుకోవాలి అన్న అంశంపై మల్లగుల్లాలు పడుతున్నాయి.

 

 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: