ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ముఖ్యంగా అమెరికా, స్పెయిన్, ఇటలీ, జర్మనీ దేశాల్లో దీని ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ... 204 దేశాల్లో కరోనా తన ఉనికి చాటుకుంది. కరోనాను కట్టడి చేయడం అగ్రరాజ్యం అమెరికా వల్లే కావడం లేదంటే.. ప‌రిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక అమెరికాలో వైద్యరంగంలో ఉన్న మౌలిక వసతుల డొల్లతనాన్ని కరోనా బయటపెట్టింది. దేశ‌దేశాలు లాక్‌డౌన్ విధించినా, ఎన్ని క‌ఠ‌న చ‌ర్య‌లు తీసుకుంటున్నా.. రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది.

 

ఇదిలా ఉంటే.. అయితే కరెన్సీ నోట్లతో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరెన్సీ నోట్లు ప్రతిరోజు కొన్ని వేల మంది చేతులు మారుతుంటుంది. ఇక కరెన్సీ నోట్లను కౌంట్ చేయడానికి చాలా మంది వాటర్ పోసిన స్పాంజీలను వాడుతారు. ఆ స్పాంజీలపై చాలా మంది వేళ్లు పెడుతుంటారు. వారిలో ఎవరికైనా కరోనా వైరస్ ఉంటే... డబ్బు కౌంట్ చేసే మిగతావారికీ అది సోకవచ్చని అంటున్నారు. అలాగే, కొంత మంది నోట్లను లెక్కించేటప్పుడు... వేళ్లను నోటితో తడి చేసుకుంటూ ఉంటారు. కాబ‌ట్టి కరెన్సీ నోట్ల వల్ల కూడా కరోనా వచ్చే ప్రమాదం ఉందంటున్నారు.  

 

అయితే మ‌రి క‌రెన్సీ నోట్ల‌పై ఎంత స‌మ‌యం క‌రోనా ఉంటుంది..? అన్న‌ది చాలా మందికి అవ‌గాహ‌న లేక‌పోవ‌చ్చు. దీనిపై ఇప్పుడో కొత్త సర్వే చేశారు. దాన్లో ఏం తేలిందంటే.. కరెన్సీ నోట్లు, స్టెయిన్‌లెస్ స్టీల్, ప్లాస్టిక్ వస్తువులు, ప్రదేశాలపై కరోనా వైరస్ రోజుల తరబడి బతికే ఉంటుందని పరిశోధన చెబుతోంది. అలాగే మాస్కులపై కరోనా వైరస్ ఏడు రోజులు బతికే ఉంటుందట. అయితే మనం కంగారుపడకుండా ఉండేందుకు మరో విషయం చెప్పారు. ఈ వైరస్ మన ఇళ్లలో అంట్లు తోమే పౌడర్లు, సబ్బులు, బ్లీచ్, సోప్ వాటర్ వంటివాటితో త్వ‌ర‌గా చచ్చిపోతుందని వెల్ల‌డించారు. ఏదేమైన‌ప్ప‌టికీ క‌రెన్సీ నోట్ల‌తో కాస్త జాగ్ర‌త్త‌గా ఉండ‌డండి సుమీ..!!

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple


   

మరింత సమాచారం తెలుసుకోండి: