అక్కడ మేకూ కొట్టలేదు, గోడా బద్దల కొట్టలేదు కానీ, గోడ నుంచి నల్లగా కారుతున్న ఆ ధార ఏమిటో చూద్దామని పై ఫ్లాట్‌కు వెళ్లారంతే ఇద్దరు స్నేహితులు.. అమెరికాలోని మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్ నగరంలో నివసిస్తున్న ఏజే ‌మెక్‌ క్రాడీ అనే యువకుడు తన స్నేహితుడి ఎవైన్ షుల్ట్జ్ కలిసి ఒక ఫ్లాట్‌ లో ఉంటున్నారు. అయితే ఈ మధ్య అతడి ఫ్లాట్‌లో ఓ గోడ నుంచి నల్లని ద్రవం ఏదో కారుతున్నట్లు కనిపించింది వారికి. అది బాగా దుర్వాసన వెదజల్లుతున్న ఆ చిక్కని ద్రవం అది ఏంటి అని వారికి అర్థం కాలేదు. అయితే దాన్ని పూర్తిగా పరిశీలనగా చూడగా అది, గోడ నుంచి కాదని.. సీలింగ్‌ కు గోడకు మధ్య ఉన్న ఖాళీ నుంచి వస్తుందని వారు తెలుసుకున్నారు.

 

 

అయితే అది కొద్ది రోజులుగా లీకవ్వతున్న తమ బాత్ రూమ్ వల్ల అది ఏర్పడి ఉండవచ్చని వారు భావించారు. దీనితో మెయిటెనెన్స్ వర్కర్లను పిలిపించిన తర్వాత బాత్రూమ్‌ లో మరమ్మతులు చేసిన తర్వాత.. ఆ ద్రవాన్ని బాగా పరిశీలించారు. అయితే దాన్ని తుడిచేందుకు ప్రయత్నించగా.. నల్లగా ఉన్న ఆ ద్రవం ముదురు ఎర్ర రంగులోకి మారింది. అప్పుడు, ఆ లీకేజీ తమ ఇంట్లోనే వస్తుందా...? లేక పై ఇంట్లో ఏదైనా ద్రవం కిందపడి లీక్ అవుతుందా అని తెలుసుకొనే ప్రయత్నం వారు చేశారు.

 


ఆ విష్యం పై తెలుసుకోవడానికి ఏజే పై ఫ్లాట్‌లోకి వెళ్లి చూశాడు. ఆ ఇంట్లో ఉంటున్న వ్యక్తిని పిలిచాడు కానీ, ఎలాంటి స్పందనా రాలేదు. దీనితో తలుపు లోపల నుంచి గడియ పెట్టి లేకపోవడంతో ఏజీ, అతని మిత్రుడు లోపలికి వెళ్లాలని చూడగా తలుపు తీయగానే ముక్కు పగిలిపోయేంత వాసన వచ్చింది వారికి. ఆ దెబ్బతో వారికి గుండె దడ పెరిగిపోయింది. అయితే ఆ ఇంట్లో ఎవరూ లేరని భావించారు. ఇక బెడ్రూమ్‌ లోకి వెళ్లి చూడగానే షాక్ అయ్యారు.

 


ఆ బెడ్రూమ్‌లో శవం వారికి కనిపించింది. దీనితో వెంటనే ఏజే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అంతటితో పోలీసులు అక్కడికి వచ్చి శవాన్ని స్వాధీనం చేసుకున్నారు వారు. అయితే అతడు సుమారు వారం రోజుల కిందట చనిపోయి ఉంటాడని, అతడి నుంచి రక్తం సీలింగ్, గోడ మధ్య ఉండే ఖాళీ నుంచి రక్తం లీకైందని పోలీసులు చెప్పుకొచ్చారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: