ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా  వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ వైరస్ బారినపడి ఎంతోమంది మృత్యువుతో పోరాడుతున్నారు.  ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కంటికి కనిపించని శత్రువుతో  ప్రపంచదేశాలు యుద్ధం చేస్తున్నారు. అయితే ఇప్పటికే ప్రపంచ దేశాల్లో చాలా మటుకు లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రజలందరూ  ఇంటికే పరిమితం కావాలని ప్రభుత్వం సూచిస్తున్నది . ఇంటికే  పరిమితం కావడం ద్వారా కరోనా వైరస్  జయించవచ్చు అని పిలుపునిచ్చారు. కానీ చాలా మంది ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ రోడ్లమీద నిర్లక్ష్యంగా తిరుగుతున్నారు. 

 

 

 దీంతో  ప్రజలను ఇంటికే పరిమితం అయ్యేలా చేసేందుకు  అటు అధికారులు ఎన్నో  ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఏదేమైనా ప్రజలు ఇంటికే పరిమితమయ్యేలా  చేసేందుకు వినూత్న  ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇండోనేషియా లో   కూడా అలాంటిదే జరిగింది.  అక్కడ  లాక్ డౌన్  కొనసాగుతున్న తరుణంలో... చాలా మంది నిర్లక్ష్యం గా బయట తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే ఓ వినూత్న ఆలోచన చేసినా అక్కడి పౌరులు ప్రజలు ఇంటి నుంచి బయటకు పెట్టాలంటే  భయపడేలా పథకం వేశారు. దయ్యం భయాన్ని చూపించి  ఇంట్లోనే ఉండేలా చేయాలి అనుకున్నారు. 

 

 

 ఈ క్రమంలోనే పథకం ప్రకారం వారిని దయ్యం లాగా డ్రెస్ వేసుకుని  అర్ధరాత్రి వీధుల్లో సంచరించడం మొదలుపెట్టారు. దీంతో ప్రజలు వారిని చూసి నిజంగా దయ్యాలేమో  అనుకుని  కాలు బయపడిపోతున్నారు ప్రజలకు ఎన్నో సార్లు చెప్పినప్పటికీ నిర్లక్ష్యంగా లాక్ డౌన్  సమయంలో కూడా బయట తిరిగారని.. ప్రస్తుతం వారికి దయ్యం అనే భయం పెట్టడంతో ఇంటినుండి  కాలు  బయట పెట్టడం లేదని చెబుతున్నారు అక్కడి పౌరులు. దయ్యం అనే నెపంతో భయపెట్టేందుకు పోలీసులు అనుమతి కూడా తీసుకున్నారట .దీన్ని  గురించి మాట్లాడిన గ్రామం పెద్ద... ప్రజలకు ఎంత చెప్పినా వినక పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు . మూఢ నమ్మకాలు మమ్మల్ని  కాపాడుతున్నాయని ఇప్పుడు అందరూ ఇంట్లోనే ఉంటున్నారు  అంటూ తెలిపారు .

మరింత సమాచారం తెలుసుకోండి: