ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో ఈరోజు 56 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఈరోజు నమోదైన కేసుల్లో కర్నూలు జిల్లాలో 19, గుంటూరు జిల్లాలో 19, చిత్తూరు జిల్లాలో 6, కడప జిల్లాలో 5, ప్రకాశం జిల్లాలో 4, కృష్ణా జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఈరోజు నమోదైన కేసులతో బాధితుల సంఖ్య 813కు చేరింది. 
 
ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 120మంది కరోనా నుంచి కోలుకున్నారు. కానీ రాష్టంలో కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 24 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. తెలంగాణ రాష్ట్రంలో 23 మంది మృతి చెందారు ఏపీలో మృతుల సంఖ్య తెలంగాణను దాటింది. రాష్ట్రంలో మృతుల సంఖ్య పెరగడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. 
 
రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. కర్నూలు జిల్లాలో ఇప్పటివరకు 203 కరోనా కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లా 177 కేసులతో రెండవ స్థానంలో ఉంది. కృష్ణా, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు ఆ తరువాత స్థానాలలో ఉన్నాయి. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ఏపీ ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేస్తోంది. 
 
రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మినహా ఇతర జిల్లాల్లో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ రెండు జిల్లాల్లో అధికారులు కేసులు నమోదు కాకుండా లాక్ డౌన్ నిబంధనలను అమలు చేస్తారు. ప్రజలు కూడా కరోనా వ్యాప్తి చెందకుండా సహాయ సహకారాలను అందిస్తున్నారు. రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లోనే కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సీఎం జగన్ నాలుగు జిల్లాలలో కొత్త కేసులు నమోదు కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు 
ఆదేశాలు జారీ చేశారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: