ఎవరైనా ఎలాంటి లైఫ్  కావాలి అనుకుంటారు. హాయిగా ఏసీలో లగ్జరీ లైఫ్ ఉండే  జీవితం కావాలి అంటారు. కానీ అలాంటి జీవితం అనుభవిస్తున్నారు ఎవరైనా ఎండలో ప్రజల కోసం కష్టపడాలని అనుకుంటారా . కానీ ఒక్కడు కదిలాడు.. పదవి కోసం కాదు ప్రజల కోసం. ఏదో ఆశించి కాదు ఏదో చేయాలని.. స్టార్ హీరోగా కొనసాగుతూ లగ్జరీ లైఫ్ గడువుతున్న  సమయంలో ప్రజలకు సేవ చేయాలని భావించి ప్రజల్లోకి వెళ్లి ప్రజల కష్టాలను తెలుసుకుని వాటిని తీర్చాలని సంకల్పంతో ముందుకు సాగాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జనసేన పార్టీని స్థాపించి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ముందడుగు వేస్తూనే ఉన్నారు. 

 

 

 అసలు రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలో నిరూపిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఎన్నోసార్లు ఓటములు... మరి ఎన్నో సార్లు ఎదురుదెబ్బలు... ఇంకెన్నో విమర్శలు... అయినప్పటికీ ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పం ముందు అవి నిలబడలేకపోయాయి. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైతే మళ్లీ సినిమాల్లోకి వెళ్లి ప్రజలను మరిచిపోతాడు అని అందరూ అంటుంటే... తన జీవితం ప్రజాసేవకే అంకితం అంటూ అందరి నోళ్ళు మూయించారు పవన్ కళ్యాణ్ . ఎలాంటి పదవి లేకుండానే ఆంధ్ర రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్షం కంటే ఎక్కువగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తు ప్రజల కష్టాలను తెలుసుకుని ప్రజలకు న్యాయం చేయాలని అలుపెరుగని పోరాటం చేస్తున్నారు పవన్ కళ్యాణ్

 

 

 ఈ కాలంలో రాజకీయాల్లోకి వచ్చి పదవి సంపాదించి డబ్బులు ఎన్ని వెనకేసుకుందామా అని అనుకుంటున్న రోజుల్లో పదవి కాదు ముఖ్యం ప్రజా సేవే ముఖ్యం అంటూ ముందుకు కదులుతున్న గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్. పదవి ఉన్న ప్రజలకు సేవ చేయని నాయకులు ఉన్న ఈ రోజుల్లో కనీసం ఏ పదవి లేకుండా ఓవైపు పార్టీని నడిపిస్తూ మరోవైపు ప్రజల కష్టాలను తెలుసుకుంటూ... న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఓటమి ఎదురైనప్పటికీ అదే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ప్రజాసేవకు పదవి కాదు సంకల్పం కావాలి అని నిరూపిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

మరింత సమాచారం తెలుసుకోండి: