మెగా బ్రదర్ నాగబాబు రాజకీయాలతో పాటు అటు బుల్లితెర కార్య‌క్ర‌మాల‌తో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా నాగబాబు మన ప్రయాణం అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. నాగబాబు క్షణం తీరిక లేకుండా బిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే అనేక విషయాలను మెగా అభిమానులతో చర్చించ లేక పోతున్నాం అని.... వాటన్నింటినీ మన ప్రయాణం కార్యక్రమంలో అభిమానుల‌కు వెళ్లేలా చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. మెగా అభిమానులకు పార్టీ పరంగా ఎలాంటి సందేహాలు ఉన్నా రెండు నిమిషాలపాటు వీడియో తీసి తన ఫేస్బుక్ అకౌంట్ కు పంపిస్తే వాటికి సమాధానాలు కూడా ఇస్తాన‌ని నాగబాబు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

 

గతవారం మెగాస్టార్ చిరంజీవి తిరిగి రాజకీయాల్లోకి రాబోతున్నారా? వస్తే అన్నయ్య అడుగులు వైసీపీవైపా.. లేక జనసేనతోనా? అసలు చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ ఉంటుందా? ఉండదా? లాంటి ప్రశ్నలపై స్పందించారు. ఇక ఆయ‌న తాజా వీడియోలో వార‌స‌త్వ రాజ‌కీయాలంటూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు ? మ‌రి మీరు ఎందుకు రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు ? అన్న ప్ర‌శ్న‌పై స్పందించారు.  తాను కూడా రాజ‌కీయాల్లో అంద‌రి లాగానే ట్రై చేశాన‌ని.. అయితే త‌న‌కు పెద్ద‌గా ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు ఆస‌క్తి లేక‌పోయినా.. ప‌వ‌న్ మాత్రం పిలిచి సీటు ఇవ్వ‌డంతో పోటీ చేశాన‌ని చెప్పారు.

 

ఇక భ‌విష్య‌త్తులో కూడా తాను ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌క‌పోవ‌చ్చ‌ని చెప్పేశారు. ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేయను. అయితే జ‌న‌సేన పార్టీ ని ముందుకు ఎలా తీసుకు వెళ్లాలి ?  అనే విష‌యంలో మాత్రం తాను భాగ‌స్వామిని అవుతాన‌ని చెప్పారు. కొత్త వాళ్లు రాజ‌కీయాల్లోకి వ‌స్తే 20 ఏళ్లలో రాజ‌కీయాలు మార‌తాయ‌ని.. ప‌వ‌న్‌, మోదీ, కేజ్రీవాల్ లాంటి చాలామంది మంచి నాయ‌కులు మన మధ్యనే ఉన్నారు.. అలాంటి వాళ్లు రాజకీయాల్లోకి రావాల‌ని నాగ‌బాబు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: