తెలంగాణ రాష్ట్రంలో రైతులందరికీ రైతు భరోసా సమకూర్చేందుకు పీసీసీ చీఫ్ ఉత్తమ్ గాంధీభవన్ లో ఒకరోజు దీక్ష చేపట్టారు. ఇక ఈ దీక్షలో పార్టీ సీనియర్ నాయకులు జానా రెడ్డి, వీహెచ్, పొన్నం మర్రి శశిధర్ లు రెడ్డిలు దీక్షలో కూర్చున్నారు. ఇకపోతే జానారెడ్డి దీక్షలో కొద్దిగా సేపు కూర్చొని మళ్ళీ వెళ్ళిపోయారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ... సీఎం ఒక్కరోజు అయినా బయటకు వచ్చారా అని ప్రశ్నించాడు. ఇక ఎప్పుడూ ప్రజల ముందు ఉండేది మేమే అని ఆయన అన్నారు.


ఇకపోతే, జగదీష్ రెడ్డి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిని ఉత్తమ్ తెలియజేశాడు. అంతే కాకుండా టెస్ట్ లు చేయకుండా కేసులు తగ్గాయి అని చెప్పడం దారుణం అని అన్నారు. రైతుల దగ్గర నుంచి కందులు కొనుగోలు చేసి రెండు నెలలు అయింది.. కానీ ఇప్పటివరకు రైతులకు డబ్బులు ఇవ్వలేదు అని తెలియజేశారు. అంతేకాకుండా మార్చ్ 15 కంటే ముందు వచ్చిన వారే వలస కార్మికులు అని ప్రభుత్వం లెక్కలు చెబుతున్నాయి అని  ఆరోపించాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వలస కార్మికులను కాపాడుకుంటూనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది అని తెలియజేశాడు.


అంతేకాకుండా రాష్ట్రంలోని కోహెడ మార్కెట్ కుప్ప కూలిపోవడం చాలా బాధాకరమని డిజిపిని కలిసి బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ కోరడం జరిగింది. అంతేకాకుండా ఉత్తమ్ దీక్షలో పార్టీ సీనియర్ నాయకులు ప్రభుత్వ తీరును తప్పు పట్టడం జరిగింది. అంతే కాకుండా దీక్షలో విహెచ్ వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఇంకా వికారాబాద్ చంద్రశేఖర్ దగ్గర ఎన్నికలు నిర్వహించే సమయంలో కొందరు నాయకులు కోట్ల రూపాయలు తీసుకున్నారని ఉత్తమ్ ఆరోపించాడు. ఇప్పటికి పార్టీలో కోవర్టులు ఉన్నారని ఆయన ఆరోపించారు. కాకపోతే... ఇక్కడ కేసీఆర్.. అక్కడ జగన్ ఉండాలని కోరుకుంటున్నారని అన్నారు. ఇలాంటి వారికోసం జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు. కాకపోతే నేను మాట్లాడిన మాటలు కొందరికి నచ్చావని నన్ను క్షమించాలని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: