కరుణ వైరస్ చైనాలోని వుహాన్ నగరంలో పుట్టింది అక్కడ నుంచి ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని దేశాల‌కు పాకింది. వుహాన్ నుంచి కొన్ని ల‌క్ష‌ల కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఆసియా, ఆఫ్రికా, ఉత్త‌ర అమెరికా దేశాల‌కు సైతం ఈ వైర‌స్ పాకింది. ప్ర‌పంచం అంతా అత‌లా కుత‌లం అవ్వ‌డంతో పాటు కొన్ని కోట్ల మంది దీని వ‌ల్ల తీవ్రంగా న‌ష్ట‌పోయారు. మ‌రి కొన్ని కోట్ల మంది ప్రాణాలు అర‌చేతుల్లో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ జీవిస్తున్నారు. అయితే చైనాలో చాలా ప్రాంతాల్లో అస్సలు క‌రోనాయే లేదు. 

 

అమెరికా మరియు యూరప్ దేశాలు ఈ వైరస్ వల్ల తీవ్రస్థాయిలో నష్టపోయాయి. దీంతో చైనా కావాల‌నే ఈ వైర‌స్‌ను ప్ర‌పంచం మీద‌కు వ‌దిలింది అన్న విమ‌ర్శ‌లు సైతం తీవ్రంగా ఉన్నాయి. ఇక అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఇది చైనా వైర‌స్ అని మీడియా ముందే బహిరంగంగా విమ‌ర్శ‌లు చేశారు. ప్ర‌పంచ దేశాలు అన్ని ఈ విష‌యంలో చైనాను త‌ప్పు ప‌డుతున్నా చైనా మాత్రం త‌న‌కేం ప‌ట్ట‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. దేశంలో క‌రోనా కోర‌లు చాస్తున్న టైంలో కూడా చైనా అంత‌ర్జాతీయంగా విమాన ప్ర‌యాణాలు నిషేధించ‌కుండా.. అటు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌కు స‌మాచారం కూడా ఆడిన ఆధారాలు ఇప్పుడు అమెరికా ద్వారా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

 

ఈ డ్రామా అంతా చైనా కావాల‌నే చేసిన‌ట్టు ఇప్పుడు ఒక్కొక్క‌టిగా ఆధారాలు బ‌య‌ట‌కు వ‌స్తుండ‌డంతో అనుమానాలు మ‌రింత‌గా బ‌ల‌ప‌డుతున్నాయి. ఇక క‌రోనా విష‌యంలో చైనా ముందు నుంచి అస‌లు నిజాలు దాచేస్తూ క‌రోనా మందుల దిగుమ‌తుల‌ను పెంచుకుని.. కావాల‌నే ఎగుమ‌తుల‌ను త‌గ్గించింద‌ని కొన్ని దేశాలు సందేహాలు వ్య‌క్తం చేస్తోన్న ప‌రిస్థితి. అసలు ప్ర‌పంచ ఆధిప‌త్యం కోసం చైనా ఇంత‌కు దిగ‌జారుతుందా ?  ఇంత‌లా చేస్తుందా ? అని ప్ర‌తి ఒక్క దేశం ఇప్పుడు చైనా తీరుపై తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేస్తున్నాయి.

 

అయినా చైనా మాత్రం త‌న‌కేం ప‌ట్ట‌న‌ట్టుగా ప్ర‌పంచ దేశాలు.. కోట్లాది మంది ప్ర‌జ‌లు ఎలా పోతే నాకేం అన్న‌ట్టుగా త‌న నీచ‌మైన బుద్ధిని చూపిస్తోంది. 
  

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: