నెల్లూరు జిల్లాలో ఒక కేసుకు సంబంధించి అసలు సంబంధం లేని వ్యక్తిని తీసుకువచ్చి తీవ్రంగా కొట్టారని ఆరోపిస్తూ ఒక తల్లి సోమవారం నెల్లూరు లోని వేదాయపాలెం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగింది. ఆ స్టేషన్ కు సంబంధించిన ఎస్సై తన కొడుకుని అనవసరంగా కొట్టాడని ఆవిడ ఆరోపిస్తోంది. తన కొడుకుని అనవసరంగా కొట్టిన ఎస్సై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆమె విజ్ఞప్తి చేస్తోంది. అయితే అసలు జరిగిన విషయంలోకి వెళితే... 

 


బాధితుడికి తల్లి చెప్పిన కథనం ప్రకారం... ఈనెల ఇరవై ఒకటో తారీఖున వేదాయపాలెంలో ఒక స్కూటీపై వెళుతున్న యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని చున్నీ లాగాడని ఫిర్యాదు పోలీస్ స్టేషన్లో అందింది. అయితే ఈ కేసును నమోదు చేసుకున్న పోలీసులు ఆదివారం నాడు గాంధీనగర్ కు చెందిన పవన్ అనే యువకుడిని పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. తనకు ఏ పాపం తెలియదని తాను ఏ అమ్మాయిని ఇబ్బంది పెట్టలేదు అని పవన్ ఎంత చెప్పినా పోలీసులు అతని గోడు అసలు వినలేదు.

 


అయితే ఇదే క్రమంలో ఎస్ఐ అతడిని తీవ్రంగా కొట్టడంతో అనారోగ్యానికి లోనయ్యాడు. ఇక దీనితో పోలీసులు అతని కుటుంబ సభ్యులకు అప్పగించగా పవన్ ని ఆస్పత్రిలో చేర్పించారు. ఇకపోతే పోలీసుల తీరును పవన్ కుటుంబ సభ్యులు నిరసిస్తూ సోమవారం నాడు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. అసలు ఈ నెల 21వ తేదీన వారి అబ్బాయి పవన్ అసలు నెల్లూరులో లేడు అని చెప్పినా వినకుండా పోలీస్ లు వారి అబ్బాయిని కొట్టారని పవన్ తల్లి చంద్రకళ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆరోపణలు చేసింది. ఇక ఈ ఘటన పై ఉన్నతాధికారులు స్పందించి సదరు ఎస్సై పై తీవ్ర చర్యలు తీసుకోవాలని ఆమె తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: