తెలుగుదేశం పార్టీలు అత్యంత సీనియర్ నాయకుడిగా పేరుపొందిన కరణం బలరాం చాలా రోజులుగా పార్టీ అధినేత చంద్రబాబు పైనా, ఆయన తనయుడు లోకేష్ పైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్ ను వైసీపీ లో చేర్చారు. కానీ తాను మాత్రం ఇంకా టిడిపిలోనే కొనసాగుతున్నారు. తెలుగుదేశం పార్టీలో అత్యంత సీనియర్ నాయకుల్లో ఒకరిగా కరణం బలరాం ఉన్నారు. టిడిపి పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ ఆయన పార్టీని వీడకుండా, ఆ పార్టీలో కొనసాగారు. ఈ సందర్భంగా ఆయన అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. కానీ తన విషయంలో చంద్రబాబు పట్టించుకోనట్టు గా వ్యవహరించడం, మానసికంగా ఎన్నో ఇబ్బందులకు గురి చేయడం వంటి కారణాలతో ఆయన చంద్రబాబు వ్యవహార శైలిపై అసంతృప్తితో ఉంటూ, ఇప్పుడు అసమ్మతి గళం వినిపిస్తున్నారు. 

 

IHG


తాజాగా ఆయన చంద్రబాబు లోకేష్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన గురించి మాట్లాడే అంత అర్హత లోకేష్ కు కానీ, చంద్రబాబుకు కానీ లేదని అన్నారు. నా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అంటూ ఆయన హితవు పలికారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి పది పన్నెండు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై లోకేష్ తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తూ, పరోక్షంగా విమర్శలు చేయడం పై కరణం బలరాం మండిపడ్డారు. 


తన గురించి మాట్లాడే అంత స్థాయి లోకేష్ కు లేదని, కష్టకాలంలో పార్టీ వెంట నడిచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, అటువంటి నా గురించి లోకేష్ లాంటి ఓడిపోయిన వ్యక్తి మాట్లాడేందుకు అర్హత ఏముంది అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు తన అవసరానికి వాడుకుని వదిలేశారని, గత టిడిపి ప్రభుత్వంలో తన రాజకీయ బద్ధ శత్రువైన గొట్టిపాటి వర్గాన్ని చేర్చుకుని తన మాటను లెక్కచేయలేదని ఆయన మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: