గత కొంత కాలంగా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో  ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంశం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. రోజురోజుకు కీలక మలుపు తిరుగుతుంది నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంశం. అటు హైకోర్టు సుప్రీంకోర్టు లోకి వెళ్ళిన నిమ్మగడ్డ అంశం మాత్రం ఒక కొలిక్కి రావడంలేదు. ఇక తాజాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ బీజేపీ నేత కామినేని, సుజనా చౌదరి ఒక హోటల్ లో రహస్యంగా భేటీ కావడం ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. 

 


 అయితే సుజనాచౌదరి కామినేని నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్టార్ హోటల్ లో ఎందుకు భేటీ అయ్యారు అనే దానిపై మాత్రం ప్రస్తుతం వైసీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ లోని అసలైన కోణం బయటపడింది అంటూ విమర్శలు చేస్తున్నారు . అయితే తనకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో కుటుంబ సంబంధం ఉందని ఆయన విడిగా వచ్చారని అదే సమయంలో కామినేని కూడా విడిగా వచ్చారు అని సుజనాచౌదరి వాదనలు వినిపించారు, వీరితో వేరువేరుగా మాట్లాడానని కానీ వీరందరితో సమావేశాన్ని క్లబ్ చేసి విమర్శలు చేస్తున్నారని ఒక వాదన వినిపించారు. 

 


 ఇక ఆ తర్వాత కామినేని ఏం మాట్లాడారు అంటే.. వాస్తవానికి నేను వెళ్ళిన తర్వాత అప్పటికే నిమ్మగడ్డ రమేష్ కుమార్ సుజనాచౌదరి మాట్లాడుకుంటున్నారని ఆ తర్వాత నేను వచ్చేసాను అంటూ చెప్పుకొచ్చారు. మేము ముగ్గురం కలిసి మాట్లాడుకున్నది  మాత్రం ఏమి  లేదు అంటూ తెలిపారు. నేను వచ్చేసిన తర్వాత కూడా వాళ్ళు అలాగే మాట్లాడుకుంటూ ఉన్నారు అంటూ తెలిపారు, అయితే సుజనాచౌదరి ఏమో విడివిడిగా వచ్చాము అని చెబుతున్నారు... కామినేని వచ్చేసరికి వేరే వాదన వినిపిస్తున్నారు. ఇలా ఇద్దరు వింత వాదన వినిపించే చివరికి బుక్కయ్యారు అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: