ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తైంది. ఏడాది కాలంలో సీఎం జగన్ ఎన్నో సంక్షేమపథకాలను అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్న తీరుపై ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సీఎం జగన్ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. జగన్ పాలన పట్ల ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
అయితే ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. అధికారులు చేస్తున్న చిన్నచిన్న తప్పుల వల్ల జగన్ సర్కార్ కు చెడ్డ పేరు వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా ఉన్న పెన్షన్లను తొలగిస్తున్నారని... పెన్షన్ల తొలగింపుకు కారణాలు ఎవరూ చెప్పడం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకే ఇంట్లో ఉన్నవారికి గతంలో వేరువేరు పెన్షన్లు వచ్చేవి. అయితే ఇప్పుడు ఈ పెన్షన్లను రద్దు చేస్తున్నారు. 
 
సాధారణంగా అవ్వాతాత పెన్షన్లలో ఒక్కరికే పెన్షన్ ఇస్తున్నారు. సీఎం జగన్ గతంలో ఇద్దరికీ పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఆ హామీ ఇప్పటివరకు అమలు కాలేదు. అదే సమయంలో వేరువేరు పెన్షన్లు ఉంటే ఆ పెన్షన్లు కూడా రద్దవుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పెన్షన్లు తొలగించడం వల్ల తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. ఒక వ్యక్తి తన ఇంట్లో నాన్నమ్మకు వృద్ధ్యాప్య పెన్షన్ వచ్చేదని... నాన్నకు వికలాంగుల పెన్షన్ వచ్చేదని.... ఇప్పుడు నాన్నమ్మ పెన్షన్ ప్రభుత్వం తొలగించిందని చెబుతున్నారు. 
 
పెన్షన్లు ఇచ్చే ప్రభుత్వాలను ప్రజలు కూడా ఆదరిస్తారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలే పెన్షన్లకు అడ్డంకులుగా మారాయి. జగన్ సర్కార్ మానవత్వంతో వీరి విషయంలో చూడాల్సి ఉంది. వారి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి ఉంది.            

మరింత సమాచారం తెలుసుకోండి: