ప్రపంచ మార్కెట్లో ప్రోత్సాహంతో మార్కెట్ నేడు ఉదయం నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ దేశ మార్కెట్లో తర్వాత ఊపందుకున్నాయి. దీంతో నేడు స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో ముగిసింది. బెంచ్ మార్కు సూచిలన్ని లాభ పడ్డాయి. ఇందులో ప్రధానంగా ప్రైవేట్ రంగ బ్యాంకింగ్, పిఎస్ యు డిమాండ్ పెరగడంతో మార్కెట్లో దూసుకుపోయాయి. ఇక మరోవైపు సెన్సెక్స్ 495 పాయింట్లు పెరిగి 35,414 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ కూడా 128 లాభం తో 10430 వద్ద ముగిసాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 34927 కు కనిష్ట స్థాయికి చేరుకునే ఆ తర్వాత మళ్ళీ రికవరీ అయ్యింది. అలాగే నిఫ్టీ కూడా 10300 కనిష్ఠ స్థాయి దగ్గరికి చేరుకొని చివరికి 10447 చేరుకుంది. 

IHG's stock market hit by slowdown woes

 

ఇక నేటి 50 లో లాభనష్టాల విషయానికి వస్తే... యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, యుపిఎల్, హెచ్డిఎఫ్ సి, బజాజ్ ఫైనాన్స్ కంపెనీ షేర్లు లాభాల బయటపడ్డాయి. ఇక ఇందులో యాక్సిస్ బ్యాంక్ ఏకంగా ఆరు శాతం పైగా లాభాల్లోకి దూసుకుపోయింది. ఇక మరోవైపు మహీంద్రా అండ్ మహీంద్రా, ntpc, నెస్లే, సిప్లా, లార్సన్ కంపెనీ షేర్లు నష్టాల బాట పడ్డాయి. ఇక ఇందులో మహీంద్రా అండ్ మహీంద్రా, ఎన్టిపిసి షేర్లు రెండు శాతం పైగా నష్టపోయాయి.

 

IHG <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=ELECTION' target='_blank' title='election-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>election</a> Results <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=2019' target='_blank' title='2019-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>2019</a>, market highlights: After hitting ...

ఇక మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో భారత రూపాయి మారకపు విలువ డాలరుతో పోలిస్తే కేవలం 2 పైసల లాభంతో 75.80 వద్ద ట్రేడ్ కొనసాగుతోంది. ఇక మరోవైపు బంగారం విషయానికి వస్తే రూ. 592 నష్టపోయి 48170 వద్ద ముగిసింది. అలాగే కేజీ వెండి వెయ్యికి పైగా నష్టపోయి 48500 కు చేరుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: