రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలిచేందుకు గతంలో సొంతంగా వ్యూహాలు రచిస్తూ ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ, రాజకీయాలు నడిపించేవి. కానీ ఇప్పుడు అటువంటి రాజకీయాలకు చెక్ పెట్టేశాయి. రెడీమేడ్ కి జనాలు ఎలా అయితే అలవాటు పడిపోయారో రాజకీయ పార్టీలు కూడా అదే తరహాలో సలహాలను కోట్లు కుమ్మరించి కొనుక్కుంటున్నాయి. అసలు ఈ తరహా ట్రెండ్ ప్రశాంత్ కిషోర్ అనబడే ఒక రాజకీయ వ్యూహకర్త కారణంగా దేశమంతా హైలెట్ అయ్యింది. గతంలో బీజేపీ ప్రభుత్వంను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రశాంత్ కిషోర్ అనబడే ఈ బీహారీ గట్టిగానే కృషి చేసినట్టుగా దేశమంతా మారుమోగింది. ఆ తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశాంత్ కిషోర్ సేవలను సమర్థవంతంగా వినియోగించుకుని ప్రధాన రాజకీయ శత్రువైన తెలుగుదేశం పార్టీ అవమానకరమైన రీతిలో ఫలితాలు దక్కేలా చేసింది.

 

అసలు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ  ఏపీలో గెలుస్తుందా లేదా అనే సందేహాలు సైతం మొదట్లో వ్యక్తమయ్యాయి. మళ్లీ ప్రతిపక్ష పాత్ర లోకి  వస్తుందని చాలమంది ముందు అంచనా వేశారు. అకస్మాత్తుగా ప్రశాంత్ కిషోర్ సలహాలు జగన్ కు బాగా పనిచేశాయి. సీట్ల కేటాయింపు దగ్గర నుంచి ఎన్నికల ప్రచారం, ప్రసంగాలు, సర్వేలు.. అబ్బో ఒకటేమిటి అన్నిటిలోనూ ప్రశాంత్ కిషోర్ మార్క్ చూపించాడు.  ఏదైతేనేమి మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏపీలో అధికారంలోకి తీసుకు రావడం, రాజకీయ చాణక్యుడుగా పేరు ఉన్న చంద్రబాబు పార్టీని ఓడించడం లో జగన్ వెన్నటే ఉండి, ప్రశాంత్ కిషోర్ ఆయన టీమ్ ఎంతో కష్టపడింది.

 

 ఇదిలా ఉంటే ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర సమయంలో ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువు అయ్యాడు. దేశంలో ఏ సీఎం చేయనంత స్థాయిలో సంక్షేమ పథకాలను నిరంతరంగా అందిస్తూ ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. అలాగే కరోనా వంటి పెను విపత్తు రాష్ట్రాన్ని చుట్టుముట్టినా, ఎక్కడా లెక్కచేయకుండా, సంక్షేమ పథకాలకు బ్రేకులు పడకుండా చూసుకుంటూ వస్తున్నారు. కానీ ప్రభుత్వానికి తగినంత క్రెడిట్ రావడం లేదనే బాధ జగన్ లో ఉంది. అధికారంలోకి వచ్చిన తరువాత పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ , సంక్షేమ పథకాలు, రివర్స్ టెండరింగ్, ఒకటేమిటి ఎన్నో ప్రజా ప్రయోజన కరమైన పనులు చేస్తున్నా తగినంత మైలేజ్ రాకపోగా, ప్రతిపక్షం ప్రతి దశలోనూ పై చేయి  సాధిస్తూ వస్తోంది.  అలాగే సొంత పార్టీ నాయకులకు చిన్నాచితకా తప్పిదాల కారణంగా ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటోంది. రాజధాని ,  పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు, ఇళ్ల పంపిణీ కార్యక్రమం ఇలా ఎన్నో విషయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు మూటగట్టుకుంటోంది.

 

ఇదే విషయం గుర్తించిన జగన్ ప్రశాంత్ కిషోర్ టీమ్ ను మళ్లీ రంగంలోకి దింపి, ప్రజలు ప్రభుత్వ తీరు గురించి తెలుసుకుని, తప్పులను సరిచేసుకుని, తన క్రెడిట్ పెరిగేలా చేసుకుందామని  చూస్తున్నా, ప్రశాంత్ కిషోర్ మాత్రం ఇప్పటికీ జగన్ కు అందుబాటులోకి రాకపోవడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు, జగన్ కూడా ప్రశాంత్ కిషోర్ కోసం ఎదురు చూస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. ఈ బీహారీ బాబు మాత్రం సొంత రాష్ట్రంలో రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతున్నాడు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: