మనిషి జీవితం మారిపోయింది... మనుషుల మధ్య దూరం పెరిగింది... బతికున్నప్పుడు దూరంగా ఉండడమే కాదు కనీసం చనిపోయిన తర్వాత కూడా కడ చూపులకు వెళ్లలేని దుస్థితి ఏర్పడింది.. దీంతో బ్రతికి ఉన్నప్పుడే కాదు చనిపోయిన తర్వాత కూడా... మనిషి శవానికి సైతం ప్రశాంతత కరువైంది.. ప్రస్తుతం ఎంత  సంపద ఉన్నప్పటికీ... ఎంతమంది బంధుమిత్రులు ఉన్నప్పటికీ... అనాధ లాగానే చనిపోవలసిన దుస్థితి ఏర్పడుతుంది... ఇలాంటి పరిస్థితిని  తీసుకొచ్చింది మహమ్మారి కరోనా వైరస్. చైనాలో ఎవడో  చేసిన పాపానికి ప్రస్తుతం ప్రపంచం మొత్తం బలవుతోంది. కాగా గత కొన్ని రోజుల నుంచి ఏపీలో రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్న  విషయం తెలిసిందే. మొన్నటి వరకు అతి తక్కువ కేసులు ఉన్న రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్  ప్రస్తుతం అతి ఎక్కువ  కేసులు ఉన్న  రాష్ట్రాలలో మూడవ జాబితాలో కొనసాగుతోంది.



దీంతో రాష్ట్రంలో రోజు రోజుకు మరింత ఆందోళనకర పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. మనిషికి మనిషికి దూరం పెంచి మనిషిలో ధైర్యాన్ని చంపి... ఆ తర్వాత మనిషినే చంపేస్తుంది కరోనా వైరస్. ఏ చిన్న పొరపాటు జరిగినా మృత్యుఒడిలోకి చేర్చేందుకు సిద్ధంగా ఉంది కరోనా వైరస్. రాష్ట్ర ప్రభుత్వం కరోనా  వైరస్ నియంత్రణలో భాగంగా కఠిన నిబంధనలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ రోజుకో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. కొన్ని కొన్ని ప్రాంతాలలో అయితే కరోనా  చిత్రవిచిత్రంగా కూడా విస్తరిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లాలో ఇలాంటి ఘటన జరిగింది. చింతలపూడి కొవ్వూరు గూడెం ఏరియాలో  ఒక వ్యక్తికి కరోనా  పాజిటివ్ అని వచ్చింది. ఈ క్రమంలోనే అతన్ని  ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి సదరు వ్యక్తి మృతి చెందారు.



దీంతో ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు అతని దహన సంస్కారాలను నిర్వహించారు. దహన  సంస్కారాలకు బంధువులు కూడా హాజరయ్యారు. వెంటనే  అప్రమత్తమైన వైద్యులు దహన సంస్కారాలకు హాజరైన వారికి కూడా కరోనా  పరీక్షలు నిర్వహించారు  ఈ పరీక్షల్లో ఏకంగా  15 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో వీరందరినీ ఏకంగా ఐసోలేషన్ వార్డులో తరలించి చికిత్స అందిస్తున్నారు.


Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: