మోదీ, బ్యాంకుల మధ్య భవిష్యత్తు కార్యాచరణ గురించి ప్రధానంగా చర్చ జరిగిందని సమాచారం. ఈ సమావేశంలో భారత్ అభివృద్ధిలో ఫైనాన్షియల్ రంగం యొక్క ప్రాధాన్యత గురించి కూడా చర్చ జరిగింది. రైతులు, స్వయం సహాయక సంఘాలు, చిరు వ్యాపారులకు రుణాలు ఇవ్వాలని మోదీ బ్యాంకులకు సూచించారు. వీడియో కాఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరిగింది.
సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు రుణాలు, కిసాన్ క్రెడిట్ కార్డులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలకు లిక్విడిటీ వంటి అంశాల గురించి కూడా సమీక్ష జరిగింది. పలు ప్రాంతాల్లో నేటికీ లాక్ డౌన్ అమలవుతోందని... ప్రజలు వైరస్ వల్ల ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారని... ఇలాంటి సమయంలో బ్యాంకుల నుంచి ఆర్థిక తోడ్పాటు ఎంతో అవసరమని మోదీ సూచనలు చేశారు.
మోదీ నేడు ఆర్బీఐ, సెబీ హెడ్స్ తో కూడా సమావేశం నిర్వహించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. రోజురోజుకు శరవేగంగా విజృంభిస్తోన్న కరోనా వైరస్ వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతోంది. మరోవైపు దేశంలో కొత్తగా 52,123 మంది కరోనా బారిన పడ్డారు. కరోనా కేసులు ఒక్క రోజులో 50 వేలు దాటడం ఇదే తొలిసారి. మన దేశంలో పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య భారీగా పెరిగిపోతూ ఉండటం గమనార్హం. ప్రతిరోజు 45,000కు పైగా దేశంలో కేసులు నమోదవుతూ ఉండటం వల్ల ప్రజల్లో భయాందోళన పెరుగుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి