ప్రస్తుతం 338 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని ఐదుగురు కరోనా మహమ్మారి సోకి మృతి చెందారని అన్నారు. టీటీడీ ఈవో చెప్పిన కరోనా లెక్కలు ప్రజలను షాక్ కు గురి చేస్తున్నాయి. ఈవో గత నెలలో టీటీడీకి భక్తుల నుంచి 16 కోట్ల రూపాయల ఆదాయం చేకూరిందని చెప్పారు. టీటీడీ వార్షిక బడ్జెట్ 3,200 కోట్ల రూపాయలు కాగా అందులో 1,350 కోట్ల రూపాయలు జీతాల కోసమే ఖర్చు చేస్తామని తెలిపారు.
మారిన పరిస్థితుల దృష్ట్యా ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నామని... అయినప్పటికీ నెలకు 150 కోట్ల రూపాయల నుంచి 200 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతోందని తెలిపారు. కార్పస్ ఫండ్ నుంచి టీటీడీ ఇప్పటివరకు ఎలాంటి నిధులు తీసుకోలేదని అన్నారు. టీటీడీ బోర్డు భవిష్యత్తులో సమావేశం నిర్వహించి కార్బస్ ఫండ్ నిధుల గురించి చర్చిస్తుందని తెలిపారు.
ఈ నెల చివరి వారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అన్ లాక్ నిబంధనలను అనుసరించి శ్రీవారి బ్రహ్మోత్సవాల విషయంలో భక్తుల భాగస్వామ్యం గురించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. తిరుమల శ్రీవారి కల్యాణోత్సవాలను ఆపాలని అర్చకులెవరూ తమతో చెప్పలేదని తెలిపారు. అర్చకులు ఏ సలహా ఇచ్చినా సీరియస్ గానే స్పందిస్తామని... కరోనా నుంచి కోలుకున్న అర్చకులు తిరిగి విధులకు హాజరవుతున్నారని చెప్పారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న అర్చకులకు విధులు ఇవ్వవద్దని ప్రధాన అర్చకులను ఆదేశించినట్లు ఈవో తెలిపారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి