ఢిల్లీ నగరం వచ్చేంతవరకు ఆమెపై పలుమార్లు తన పశువాంఛ తీర్చుకున్న బస్ కండక్టర్ తదనంతరం ఆమెను వదిలేశాడు. అయితే వెంటనే బస్సు పై నుండి కిందికి దిగిన బాధితురాలు బస్ కండక్టర్ తనపై అత్యాచారం చేశాడని చెప్పడంతో ప్రయాణికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే బస్సు కండక్టర్ ని పట్టుకొగా... బాధితురాలు 112 కి డయల్ చేసి పోలీసులకి సమాచారం అందించింది. విషయం తెలుసుకున్న ఢిల్లీ పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి నిందితుడిని పోలీస్ స్టేషన్ కి తరలించారు. అలాగే బాధితురాలి ఫిర్యాదు మేరకు కండక్టర్ రవి పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఏది ఏమైనా 40 మంది ప్రయాణికులు ఉన్న కూడా ఒక ఆడపడుచు కి సేఫ్టీ లేకుండా పోవడం ప్రస్తుతం అందరం విస్తుపోయేలా చేస్తోంది. గతంలో నిర్భయ కూడా కదులుతున్న బస్సులోనే అత్యాచారం జరిగింది. నిందితులకు ఉరిశిక్ష పడిన కూడా మగ మృగాలు ఆడవారి పై అత్యాచారం చేయడానికి ఏమాత్రం వెనకాడటం లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి