ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం ఎంతగా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపుగా అందరూ గంటలకు గంటలు సోషల్ మీడియా వేదికగా గడుపుతున్నారు. అయితే ఈ సోషల్ మీడియా మంచి పనుల కోసమే కాదు... ఈ సోషల్ మీడియా కారణంగా ఎన్నో దారుణ ఘటనలు  కూడా చోటుచేసుకుంటున్నాయి. సోషల్ మీడియా కారణంగా ఎంతోమంది ప్రాణాలు కూడా పోతున్న ఘటనలు తెర మీదకు వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. సోషల్ మీడియా పరిచయం ఏకంగా ఓ యువకుడి ప్రాణం తీసింది. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని పూణేలో వెలుగులోకి వచ్చింది.



 సోషల్ మీడియాలో పరిచయమైన ఆంటీతో యువకుడు తరచు  ఫోన్ లో  మాట్లాడడం మెసేజ్ చేస్తూ ఉండడం గ్రహించిన ఆమె భర్త కోపంతో ఊగిపోయి యువకుడిని కిరాతకంగా చంపేశాడు. పూణే  నగరంలోని సంజయ్ నగర్ కు చెందిన సౌరబ్  జాదవ్ ఓ మొబైల్ యాక్సెసరీస్ కంపెనీలో డెలివరీ ఎగ్జిక్యూటివ్ గా  పనిచేస్తున్నాడు. అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో ఇటీవలే ఓ పెళ్ళైన మహిళ తో ఫేస్బుక్ లో  పరిచయం ఏర్పడింది. ఇక ఇద్దరు తరచూ చాటింగ్ చేసుకోవడంతోపాటు ఫోన్ లో మాట్లాడుకునే వారు. కానీ ఓ రోజు ఈ విషయం కాస్త ఆమె భర్తకు తెలిసింది. భార్య చేస్తున్న పని చూసి ఆగ్రహంతో ఊగిపోయాడు భర్త.




 అయితే వీరిద్దరి మధ్య పెళ్లికి ముందు నుంచే ఈ సంబంధం కొనసాగుతోందని భావించి ఎలాగైనా యువకున్ని  అంతం చేయాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే తన స్నేహితుడితో కలిసి యువకుడిని అంతమొందించేందుకు పథకం రచించాడు. ఓ రోజు సౌరబ్ కి  ఫోన్ చేసి ఓ ప్రాంతానికి రమ్మని పిలిచాడు. సౌరబ్ అక్కడికి వెళ్లగానే కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశారు. ఇక మృతుడు సౌరబ్ సోదరుడు ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో స్థానికులు అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: