అయితే ఎవరికి తెలియకుండా కాదు పెద్దలందరికీ తెలిసి దీనిని ఒక వేడుక జరుపుతారు. తర్వాత నచ్చితే పెళ్లి చేసుకుంటారు లేకపోతే లేదు. ఈ ఆచారం ఎక్కడో కాదు ఇండియాలోని చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో . వివరాల్లోకి వెళితే.. చత్తీస్ ఘడ్ రాష్ట్రం లోని బస్తర్ జిల్లాలో... ఇంద్రావతి నదికి ఉత్తరాన మూయురి అనే తెగ ప్రజలు నివసిస్తున్నారువీరు ఇప్పటికీ కూడా పురాతన కాలం నుంచి వస్తున్న సంప్రదాయాన్ని ఇంకా పాటిస్తూనే ఉన్నారు. ఈ ఆచారంలో భాగంగా.. యువతి యువకులు ముందుగా ప్రేమించుకోవాలి... ఆ తర్వాత వీరి ప్రేమ విషయం పెద్దలకు తెలియగానే... ఏడు రోజుల పాటు వీరు ఏకాంతంగా గడిపేందుకు ప్రత్యేకంగా గోటుల్ పేరుతో గుడిసెలు ఏర్పాటు చేస్తారు.
ఈ గుడిసెలో యువతీ యువకులు పెళ్లికి ముందే ఏకాంతంగా ఏడురోజులపాటు గడపాలి. అయితే యువతీ యువకులు మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఇలా ఏర్పాటు చేస్తారు. ఇక ఆ గుడిసె వైపు ఎవరూ కూడా వెళ్లరు. అయితే ఈ క్రమంలోనే వారు శృంగారంలో కూడా పాల్గొనవచ్చు. ఏడు రోజుల పాటు ఒంటరిగా ఉన్న తర్వాత వారికి నచ్చితే అదే యువతి లేదా యువకులను పెళ్లి చేసుకోవచ్చు. లేదా వేరే వాళ్లను పెళ్లి చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అక్కడ తెగ వాళ్ళందరూ ఇప్పటికీ ఇదే సంప్రదాయాన్ని పాటిస్తుండగా కొంతమంది మాత్రం ఈ సాంప్రదాయం నచ్చక పట్టణాలవైపు వలసపోతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి