ఈ స్కాములోనే కాదు ఏ స్కాములోనైనా సొంత పార్టీ నేతలు ఉన్నా, ఎంతటివారినైనా వదిలేది లేదు అని జగన్ ఇప్పటికే మంత్రి వర్గ సమావేశంలో చెప్పారు.. దాంతో వారు ఇప్పుడు కొంత అయోమయంలో పడ్డట్లు తెలుస్తుంది. ఈ ఎస్ ఐ స్కాం లో వైసీపీ మంత్రి గుమ్మనూరు జయరాం పేరు వినిపిస్తుండడంతో ఒక్కసారిగా పార్టీ క్యాడర్ ఉలిక్కి పడింది.. ఏపీ మంత్రివర్గంలో వరస ఆరోపణలు ఎదుర్కొంటున్న జయరాంపై ముఖ్యమంత్రి జగన్ కూడా సీరియస్ గా ఉన్నట్లు తెలిసింది. జయరాం పై వచ్చిన ఆరోపణలపై నిజమెంతో తెలుసుకోవాలని జగన్ సీఎంఓ ఉన్నతాధికారిని కోరినట్లు సమాచారం. విచారణలో తప్పు ఉన్నట్లు తేలితే గుమ్మనూరి జయరాంను మంత్రివర్గం నుంచి జగన్ తొలిగించడం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు చేసిన విమర్శలే జయరాంపై వస్తున్న ఈ ఆరోపణలకు కారణం అని చెప్పొచ్చు.. స్కాములో ఉన్న నిందితుడు కార్తీక్ జయరాం కుమారుడికి బెంజ్ కార్ ని కొనిచ్చారని అయన ఆరోపణలు చేయగా మంత్రి దీన్ని తీవ్రంగా ఖండించారు.అంతేకాదు ఈ మంత్రి సిఫారసు మేరకే కార్తీక్ ని 14 వ నిందితుడిగా ఏసీబీ చేర్చిందని ఆరోపించారు.. ఒకవేళ నేను బెంజ్ కారు తీసుకుంటే ఆ నిందితుడు ఎలా పట్టుపడేవాడని అన్నారు.. మరి తనపై పై వస్తున్న ఆరోపణలు అబద్ధమేనని నిరూపించుకోకపోతే మంత్రి రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంలో పడే అవకాశం ఉంది.. ఈ నేపథ్యంలో అయన ఏం చేస్తారో చూడాలి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి