గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గులాబీ పార్టీ జెండా రెపరెపలు ఆడించడం, ,గ్రేటర్ మొత్తం కారు ఓవర్ స్పీడ్ తో దూసుకుపోతుంది లే అన్నట్టుగా ఎన్నో పరిణామాలను ఊహించుకుంటూ టిఆర్ఎస్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. కాంగ్రెస్, బిజెపి లకు తమతో పోటీ పడేంత స్థాయిలేదని, ప్రజలు మళ్ళీ 2016 ఏ విధంగా అయితే గ్రేటర్ ఎన్నికల్లో తమకు పట్టం కట్టారో అదేవిధంగా ఇప్పుడు పట్టం కడతారని, ఎన్నో ఆశలు టిఆర్ఎస్ పార్టీ పెట్టుకుంది. ఈ మేరకు ఎక్కడికక్కడ కేటీఆర్ రంగంలోకి దిగి, అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తూ, అనేక హామీలు ఇస్తూ, పార్టీ తరఫున డివిజన్ ల వారీగా పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం సీనియర్లను నియమిస్తూ, గెలుపు కోసం గట్టిగా కృషి చేస్తూ వస్తోంది.


 సుమారు వందకు పైగా స్థానాల్లో టీఆర్ఎస్ జెండా ఎగరాలి అన్నదే కేటీఆర్ సంకల్పం. దీనికోసం గట్టిగానే కృషి చేస్తూ ఉండగా, అకస్మాత్తుగా హైదరాబాదును వరదలు ముంచెత్తడం, రోడ్లపై కాలువల్లా, నీళ్ళు పారుతుండడం వంటి వ్యవహారాలతో కారు జోరుకు గ్రేటర్ లో వచ్చిన వరదలు బ్రేకులు వేసిందని చెప్పాలి. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న కేటీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలను జనాలు ఎక్కడికక్కడే నిలదీస్తూ, వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తుండడం, ప్రజలు అనేక రకాలుగా వరదలతో పడుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ నాయకుల పై ఆగ్రహం వ్యక్తం చేయడం వంటి ఎన్నో పరిణామాలు ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి ఊహించని దెబ్బ తగిలేలా చేస్తోందనే సంకేతాలు అప్పుడే మొదలయ్యాయి.


 ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి తాము ఎన్నో వందల కోట్లు ఖర్చు చేశామని, మరెన్నో పనులు చేస్తామని ఇప్పటి వరకు  వరకు గొప్పగా చెప్పుకుంటూ వచ్చిన టిఆర్ఎస్ కు ఇప్పుడు నగరం మొత్తం నిండుకుండలా నిండిపోవడంతో, ప్రజలకు ఏం చెప్పుకోవాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో ఈ వానల ప్రభావం గట్టిగానే ఉంటుందని, ఇది తమ రాజకీయ ప్రత్యర్ధులకు మేలు చేస్తుందనే భయం టిఆర్ఎస్ నేతలను వెంటాడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: