విరాట్ కోహ్లీకి ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచంలోనే నెంబర్వన్ బ్యాట్స్మెన్ గా  కొన్నేళ్ల నుంచి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు విరాట్ కోహ్లీ. తనపై ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ నోటితో కాకుండా బ్యాట్ తోనే సమాధానం చెబుతూ వస్తున్నాడు. ఇక విరాట్ కోహ్లీ ఒకసారి రంగంలోకి దిగి ఫామ్ లోకి  వచ్చాడు అంటే బౌలర్ల వెన్నులో వణుకు పుడుతుంది అన్న విషయం తెలిసిందే. కాగా  విరాట్ కోహ్లీ దంపతులు ఇటీవలే అభిమానులందరికీ శుభవార్త తెలిపారు. తాను తండ్రి కాబోతున్న విషయాన్ని తెలిపి  మురిసిపోయాడు విరాట్ కోహ్లీ.



 ఈ క్రమంలోనే ఎంతోమంది అభిమానులు క్రికెటర్లు సైతం విరాట్ కోహ్లీ దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. ఇక విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ కూడా ఎప్పటికప్పుడు గర్భంతో ఉన్న ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ ఉంటుంది. కాగా ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో ఆడుతున్న సమయంలో అనుష్క శర్మ కూడా క్వారంటైన్ పూర్తి చేసుకొని ప్రస్తుతం విరాట్ కోహ్లీతో ఉంటున్న విషయం తెలిసిందే. ఇకపోతే విరాట్ కోహ్లీ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తూ ఉంటాడు. తన ఫిట్నెస్ విషయంలో... కెప్టెన్సీ విషయంలో... బ్యాటింగ్ విషయంలో కూడా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తూ ఉంటాడు విరాట్ కోహ్లీ.




 అయితే తనకు మాత్రం ఒక మహిళ ఎంతో ఆదర్శం అంటూ చెప్పుకొచ్చాడు. పిల్లలు పుట్టి తల్లిదండ్రులు అయ్యాక కూడా క్రీడల్లో  అద్భుతంగా రాణించవచ్చు అంటూ నిరూపించిన మేరీ కోమ్ తనకు ఎప్పుడూ ఆదర్శంగా నిలుస్తుంది అంటూ ఇటీవల చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ. నలుగురు పిల్లలు అయ్యాక కూడా రాణించడం ఎంతో గొప్ప విషయం అంటూ చెప్పుకొచ్చాడు. ఇంస్టాగ్రామ్ లైవ్ లో విరాట్ కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇక అనుష్క శర్మకు జనవరి నెలలో డెలివరీ కానుండగా.... విరాట్ కోహ్లీ ఒక బిడ్డకు తండ్రి కాబోతున్నాడు. విరాట్ కోహ్లీ వ్యాఖ్యలపై స్పందించిన మేరీ కోమ్... పెళ్లి తర్వాత తన భర్త తనకు ఎంతగానో అండగా నిలిచారని అతనిచ్చిన ప్రోత్సాహంతోనే క్రీడల్లో రాణించాను  అంటూ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: