అబ్బా..! ఈ రాజకీయాలున్నాయే పవన్ కు అర్థమే కావడం లేదుగా ? 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా ఉన్నట్లుగా కనిపించడం లేదు. ఆయన ఏ పార్టీతో కలిసి ముందడుగు వేసినా, రాజకీయంగా ఆయన తీవ్రంగానే నష్ట పోతున్నట్టు కనిపిస్తున్నారు. 2019 ఎన్నికల్లో టిడిపి బిజెపి కూటమికి పవన్ మద్దతు పలికారు. ఆ సమయంలో ఎక్కడా పోటీ చేయలేదు. ఇక ఆ తర్వాత టిడిపి ప్రభుత్వంలో ఆ పార్టీకి అన్ని రకాలుగా పవన్ ఉపయోగపడడంతో, ఆయనపై టిడిపి ముద్ర బలంగా పడిపోయింది. ఆ సమయంలో రాజకీయంగా జనసేన ను బలోపేతం చేయడంలో ఆయన నిర్లక్ష్యం వహించడంతో 2019 ఎన్నికల్లో బలహీనంగానే పవన్ కనిపించారు. 


అయినా, ఏదో రకంగా తాము అధికారంలోకి వస్తామని గట్టి నమ్మకం ఆయనలో కనిపించింది. ఇక కమ్యూనిస్టులు, బి ఎస్ పి పార్టీతోనూ పవన్ పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లినా, మొత్తం పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఒక్కటి మినహా మిగతా అన్ని చోట్లా పరాజయం పాలయ్యారు. 2024 నాటికైనా అధికారం దక్కించుకోవాలని చూస్తున్న పవన్ ఇప్పుడు బిజెపితో పొత్తు పెట్టుకున్నారు. పొత్తు అయితే పెట్టుకున్నారు గాని, బిజెపి తనను పట్టించుకోనట్టు గానే వ్యవహరిస్తుండడంతో, ఏం చేయాలో పాలుపోని పరిస్థితి పవన్ కు ఏర్పడింది. ఇప్పుడు బిజెపిని కాదనుకుని బయటకు వెళ్ళినా, ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేని పరిస్థితి నెలకొంది. పవన్ ఎప్పుడూ ఆహ్వానించేందుకు రెడీగా చంద్రబాబు ఉన్నా, ఆ పార్టీతో కలిసి అడుగులు వేస్తే, రాజకీయంగా మరింతగా, కోలుకోలేని విధంగా జనసేన పార్టీ దెబ్బతింటుందనే విషయం పవన్ కు బాగా తెలుసు. అందుకే కష్టమైన బీజేపీలో కొనసాగుతున్నారు. 


ఆ పార్టీతోనే కలిసి అధికారం దక్కించుకోవాలని చూస్తున్నారు. ఇదిలా ఉండగానే జగన్ వైపు బిజెపి అడుగులు వేస్తుండటం, జగన్ మద్దతు పొందేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తూ ఉండటం వంటి వ్యవహారాలు కారణంగా, బీజేపీతో కలిసి ముందుకు వెళ్లడం ఎంతవరకు కరెక్ట్ అనే విషయంలో పవన్ క్లారిటీ తెచ్చుకో లేకపోతున్నారు. పొత్తుల విషయంలో పవన్ తప్పటడుగులు వేశారా  ? 2014 ఎన్నికల సమయంలో ని పవన్ సరైన విధంగా, తన రాజకీయ అడుగులు వేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అనే అభిప్రాయాలు ఇప్పుడు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: