దీనికి కారణం కాశ్మీర్ ప్రాంతంలో 370 ఆర్టికల్ అమలులో ఉండటంతో అక్కడ పూర్తిగా పాకిస్తాన్ ఎంతగానో ప్రభావితం చేస్తూ ఉండటమే. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత 370 ఆర్టికల్ రద్దు చేయడం.. ఇక కాశ్మీర్ లోని మారుమూల గ్రామాలను సైతం ఎంతో అభివృద్ధి చేస్తూ ఉండడంతో.. గతంలో పాకిస్థాన్ వైపున్న ప్రజలు సైతం తమవైపు తిప్పుకోవడం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. అయితే స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కాశ్మీర్ ప్రాంతం నుంచి సైన్యంలో చేరలేదు. కానీ ఇప్పుడు కాశ్మీర్ లోని యువత ఇప్పుడు సైన్యంలో చేరేందుకు ముందుకు వస్తూ ఉండడం శుభపరిణామం అని చెప్పాలి.
ఇటీవలే కాశ్మీర్ లో ఆర్మీ సెలక్షన్స్ శిక్షణ కు సంబంధించినటువంటి కార్యక్రమం ఏర్పాట్లను అధికారులు చేశారు. ఈ కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన వచ్చింది ఏకంగా 11 వేల మంది కాశ్మీర్ యువకులు సైన్యంలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఇది ఒక శుభ పరిణామం అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. క్రమంగా కాశ్మీరీ యువతలో కూడా తాము పాకిస్తాన్ పౌరులం కాదు భారత పౌరులం అనే ఆలోచన పెరిగిపోయి ప్రస్తుతం భారత్ వైపు నడుస్తున్నారు అని విశ్లేషకులు అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి