పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి మాత్రమే నిధులిస్తామని.. పునరావాసంతో తమకు సంబంధం లేదని తేల్చి చెప్పింది కేంద్రం. ఆర్టీఐ ద్వారా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయ్‌. దీంతో ఏపీలో మరోసారి పోలవరంపై రాజకీయ వేడి పెరిగింది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా.. డ్యామ్ నిర్మాణం వరకే తాము నిధులిస్తామని.. అంతకు మించి పునరావాసంతో తమకేం సంబంధం తేల్చి చెప్పింది కేంద్రం. 2016 సెప్టెంబర్‌ 30వ తేదీ నాటి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన మెమో ప్రకారం కేవలం డ్యామ్‌ నిర్మాణానికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం నిధులిస్తుందని స్పష్టం చేసింది కేంద్రం.

అత్యంత కీలకంగా వ్యవహరించాల్సిన బీజేపీ పోలవరం విషయంలో ఆచి తూచి స్పందిస్తోంది. ఆర్టీఐ ద్వారా రాబట్టింది.. వివరాలు మీడియాకు రిలీజ్‌ చేసిన బీజేపీ.. పోలవరం విషయంలో తాము పూర్తి క్లారిటీతో ఉన్నామని.. పోలవరం నిర్మాణం బాధ్యత కేంద్రానిదేనని అంటోంది. అయితే పునరావసం గురించి మాత్రం అధికారికంగా క్లారిటీ ఇవ్వని పరిస్థితి బీజేపీ వైపు నుంచి కనిపిస్తోంది.

పోలవరం ప్రాజెక్టు నిధుల కోసం పోరాటం చేయకుండా.. కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని ఆరోపించారు నారా లోకేష్‌. అసలు ప్రాజెక్టు  పూర్తి చేస్తారో లేదో పిల్ల కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మాజీ ఇరిగేషన్‌ శాఖ మంత్రి దేవినేని ఉమ కూడ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

గత ప్రభుత్వం చేసిన ఘోర తప్పిదం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపిస్తోంది వైసీపీ ప్రభుత్వం. పోలవరంపై కేంద్రం వైఖరికి టీడీపీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారుమంత్రి అనిల్ . చంద్రబాబు వైఖరే పోలవరానికి శాపంగా మారిందని మండిపడ్డారు. మొత్తానికి పోలవరంపై కేంద్ర నిర్ణయంతో ప్రాజెక్టు నిర్మాణం  ప్రశ్నార్థకంగా మారింది. పునరావాసం విషయంలో కేంద్రం కనికరించకుంటే తప్ప తిప్పలు తప్పేలా లేవు. మొత్తానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై క్లారిటీ వచ్చేసింది.








మరింత సమాచారం తెలుసుకోండి: