సాధారణంగా కొన్నికొన్ని చిత్ర విచిత్రమైన ఘటనలు సినిమాల్లో చూస్తుంటాం. ఏకంగా అప్పటి వరకు రోడ్డుపై స్పీడుగా దూసుకెళ్తున్న కారు నిమిషాల వ్యవధిలో విమానం గా మారిపోయి గాల్లోకి ఎగురుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత మళ్లీ రోడ్డుమీదికి ల్యాండ్ అయ్యి  కారు లాగా దూసుకు పోతూ ఉంటుంది ఇలాంటివి చాలా మటుకు హాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. నిజజీవితంలో కూడా ఇలాంటి ఒక కారు ఉంటే ఎంత బాగుండు. హాయిగా రోడ్డుమీద ప్రయాణించవచ్చు గాలిలో కూడా ఎగరవచ్చు అని అనుకోని  వాహనదారులు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. కానీ ఇది నిజ జీవితంలో సాధ్యమయ్యే పని కాదు కదా అని అనుకుంటారు.



 కానీ అలా అనుకున్నారంటే మీరు పప్పులో కాలేసినట్లే... ఒకప్పుడు సినిమాల్లో చూసి ఇది ఎలా సాధ్యం అని ఆశ్చర్యపోయిన ఆవిష్కరణ ప్రస్తుతం కళ్లముందుకొచ్చింది. రోడ్డుపై రై రై మంటూ దూసుకుపోయే కారే ప్రస్తుతం విమానంలా  గాలిలో దూసుకుపోయే ఓ  సరికొత్త ఆవిష్కరణలు తెరమీదికి వచ్చింది. రోడ్డుపై ప్రయాణించే కారు  నిమిషాల వ్యవధిలోనే విమానం గా మారిపోయి గాలిలోకి ఎగురుతుంది. అంతే కాదు ఎంతో సులభంగా ల్యాండింగ్ కూడా అవుతూ ఉంటుంది. తాజాగా ఇలాంటి ఆవిష్కరణతో ప్రస్తుతం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది ఐరోపా లోని ప్రముఖ కార్ల తయారీ సంస్థ.



 ఇక 30 ఏళ్ల పాటు కష్టపడి రోడ్డుపై  దూసుకుపోయే కారు తో పాటు క్షణాల వ్యవధిలో విమానంలా  గాల్లోకి ఎగిరే కారును  కూడా తయారు చేసి ప్రస్తుతం ఔరా అనిపించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఐరోపాలోని సోకేవియ  దేశానికి చెందిన క్లెయిన్ విజన్  అనే సంస్థ.. గాల్లో ఎగిరే కారు ని తయారుచేసింది. ఎయిర్ కార్ ప్రయోగాలను ఎంతో విజయవంతంగా పూర్తి చేసినట్లు సంస్థ వెల్లడించింది. 1100  కిలోల బరువుండే ఈ సూపర్ కార్ 200 కిలోల వరకు మోయగలదు. కేవలం మూడు నిమిషాల్లోనే విమానం గా తయారయ్యి గాలిలోకి ఎగురుతుంది. ఇక దీన్ని తయారు చేయడానికి దాదాపు 30 ఏళ్ళు కష్ట పడినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: