ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దు ల్లో  తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి అన్న  విషయం తెలిసిందే. ప్రశాంతం గా ఉన్న సరిహద్దు ల్లో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించిన చైనా ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నది . అయితే గతంలో సరిహద్దు లో చైనా సృష్టించిన వివాదం సద్దుమణిగే లా  చేయడానికి... భారత్  ఎన్నోసార్లు చైనాను చర్చలకు పిలిచింది. అయితే భారత్ ముందుకు వచ్చి చైనా తో  ఎన్నిసార్లు చర్చలు జరిపినప్పటికీ చైనా మాత్రం తోక జాడిస్తూ  వ్యవహరించింది అనే విషయం తెలిసిందే.



 ఈ క్రమంలో నే సరిహద్దు ల్లో పరిస్థితి రోజు రోజుకు ఉద్రిక్తం గా మారింది. ఎన్నిసార్లు చర్చలు జరిపినప్పటికీ చైనా తీరు మార్చుకోక పోవడం తో వ్యూహాన్ని మార్చిన భారత్ ఏకంగా చైనా ఊహించని విధంగా దెబ్బ కొట్టింది అనే విషయం తెలిసిందే. ఏకంగా  చైనా సరిహద్దుల్లోకి  దూసుకు పోయి చైనా వ్యూహాత్మక ప్రదేశాలైన కొన్ని పర్వతాల ను స్వాధీనం చేసుకుంది భారత సైన్యం. ఇప్పుడు శీతాకాలం అయినప్పటికీ గడ్డకట్టుకు పోయే చలిలో పహారా కాస్తున్నారు ప్రస్తుతం భారత్  చైనా సైనికులు,



 అయితే ఒకప్పుడు భారత సరిహద్దు లో తలెత్తిన వివాదాన్ని సద్దుమణిగే లా చేయడానికి చర్చలు జరపాలి అంటూ చైనాను కోరినప్పటికీ... చైనా మాత్రం చర్చల విషయంలో అలసత్వం వహిస్తూ  వచ్చేది. కానీ ప్రస్తుతం చైనా చర్చలు జరపాలని కోరుతుంటే... చైనా చేసిన విధంగానే ప్రస్తుతం చర్చల విషయంలో కాస్త ఆలస్యం చేస్తూ వస్తోంది భారతదేశం. ఈ క్రమంలోనే చైనా భారత తీరుతో విసిగి పోతుంది. సరిహద్దుల్లో చలి దాటికి చైనా సైనికులు తట్టుకోలేక అనారోగ్యం బారిన పడుతుండటం ప్రాణాలు కోల్పోవడం కూడా జరుగుతూ ఉండడంతో చైనాను  మరింత అయోమయంలో పడేస్తుంది. రానున్న రోజుల్లో భారత్-చైనా సరిహద్దు లు మరెలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్నది చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: