గ్రేటర్ వార్ వాడివేడిగా జరగబోతుండడం తో అన్ని రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎన్నికల ప్రచార లు హోరెత్తుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కీలక నాయకులతో పాటు , జాతీయ స్థాయి నాయకులను రంగంలోకి దించి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఇప్పుడు టిఆర్ఎస్ , బిజెపి , కాంగ్రెస్ వంటి పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నియోజకవర్గ,  మండల స్థాయి నాయకులు అందరిని గ్రేటర్ లో మోహరించాయి. డివిజన్ల వారీగా అందరికీ బాధ్యతలు అప్పగించి వారి వ్యవహారాలను ఎమ్మెల్యేలు మంత్రులు పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. 



ప్రతి ఇంటికి పార్టీ జెండా, అజెండాను తీసుకెళ్లే విధంగా అన్ని పార్టీలు ప్రణాళికను సిద్ధం చేసి అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ విషయంలో టీఆర్ఎస్ పార్టీ కాస్త ముందు ఉన్నట్లుగా కనిపిస్తోంది.ఒక్క సీటు కూడా చేజారకుండా 150 డివిజన్ లలోనూ  పూర్తిస్థాయిలో తమ సైన్యాన్ని టిఆర్ఎస్ మోహరించింది. అలాగే బిజెపి సైతం రాష్ట్ర నాయకులతో పాటు, జాతీయ స్థాయిలో ఉన్న నాయకులను, కేంద్ర మంత్రులను రంగంలోకి దించి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇక కాంగ్రెస్ సైతం ఇదే ఇదే విధంగా ఎన్నికల తంతును మొదలు పెట్టింది. దీంతో ఇప్పుడు హైదరాబాదులో ఎక్కడ చూసినా, నాన్ లోకల్ వాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. 



చోటా మోటా నాయకులు అంతా నగరం లో చక్కర్లు కొడుతూ తమ పార్టీ విజయానికి తమ వంతు కృషి చేస్తున్నారు. నాయకుల రాకతో లాడ్జీలు , ఫంక్షన్ హాల్ కు భారీగా డిమాండ్ పెరిగిపోయింది. అన్ని పార్టీల నాయకులు గ్రేటర్ లో సందడి చేస్తుండడం,  డివిజన్ల వారీగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉండడం, అసలు కొత్త నాయకుల హడావిడి ఏంటో..? అని ప్రజల్లోనూ చర్చ జరుగుతోంది. ఒక్క ఇంటిని కూడా వదిలిపెట్టకుండా అన్ని పార్టీల నాన్ లోకల్  నాయకులు జల్లెడ పెట్టేస్తూ, తమ పార్టీకి విజయాన్ని చేకూర్చే బాధ్యతలను భుజాన వేసుకున్నారు. వీరి రాక కారణంగా హైదరాబాద్ లో కొత్త సందడి నెలకొంది. ఎక్కడ చూసినా భారీ ఎత్తున ఫ్లెక్సీలు దర్శనమిస్తూ రాజకీయ పండగ వాతావరణం కనిపించేలా చేస్తున్నాయి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: