ఒకప్పుడు శత్రు దేశాలపై కేవలం తుపాకుల తో మాత్రమే దాడి చేసేవారు అన్న విషయం తెలిసిందే. కేవలం ఎదురు బొదురు ఉన్నప్పుడు మాత్రమే దాడి చేయడానికి వీలు ఉండేది. కానీ ప్రస్తుతం యుద్ధ రీతులు  పూర్తిగా మారిపోతున్నాయి. ఎదురుగా ఉన్న శత్రువులను కాదు ఎక్కడో కొన్ని కిలోమీటర్ల అవతల  కనిపించకుండా ఉన్న శత్రువుల ను ఏకంగా తుపాకీ గుండు వేడి  ఆధారం గా గుర్తించి నాశనం చేయగల సత్తా కలిగిన సరికొత్త టెక్నాలజీతో కూడిన ఆయుధాలు ప్రస్తుతం తెర మీదికి వస్తున్నాయి .


 ఏకంగా ఎన్నో  కిలోమీటర్ల దూరం లో ఉన్న ఇటువంటి శత్రువు ను కూడా ఎంతో సమర్థవంతం గా నాశనం చేయగల స్నిపర్ రైఫిల్స్ దగ్గర్నుంచి  భుజాన వేసుకుని ఎంతో దూరం లో ఉన్నటువంటి శత్రువుల ను తుపాకీ గుండు వేడి  ఆధారంగా గుర్తించి ఆ ప్రాంతం మొత్తాన్ని నాశనం చేయగల సత్తా కలిగిన మిస్సైల్స్  కూడా తయారయ్యాయి.


 అంతే కాకుండా ఒకప్పుడు డ్రోన్లు అంత శత్రు దేశాల సరిహద్దుల్లో కి వెళ్లి అక్కడ పరిస్థితుల ను గమనించి వీడియో తీసి ఆర్మీ కి  సమాచారం అందించేవి కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా  డ్రోన్ల ద్వారా పెద్ద సైజు బాంబులు తయారు చేసి శత్రు దేశాల పై దాడి చేసే విధంగా అధునాతన టెక్నాలజీ తో తయారు చేసిన డ్రోన్ లు  ఉన్నాయి. అయితే ఇలాంటి డ్రోన్ లను  ప్రస్తుతం ఇజ్రాయిల్ భారత్కు ఇచ్చేందుకు సిద్ధం అయింది అని అర్థమవుతుంది. సరిహద్దు ల్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా... భారీ మొత్తం లో డ్రోన్ లు  భారత్కు ఇచ్చేందుకు సిద్ధం అయిందట. ఇవి మంచు  ప్రదేశాల లో  కూడా ఎంతో సమర్ధవంతం గా పని చేయగల సత్తా కలిగి ఉన్న డ్రోన్లు  అని ప్రస్తుతం రక్షణ రంగ నిపుణులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: