ఇటీవల అమెరికా లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్  ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. డోనాల్డ్ ట్రంప్ పై డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్  తిరుగులేని విజయాన్ని సాధించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మును పెన్నడూ లేని విధంగా  అత్యధిక మెజారిటీ సాధించిన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి గెలుపొందారు అనే విషయం తెలిసిందే.  అయితే జో బైడెన్ గెలిచిన నాటి నుండి  కూడా ట్రంప్  ఇప్పటికీ కూడా ఓటమిని జీర్ణించు కోలేక పోతున్నారు.



 ఈ క్రమంలో నే ఓట్ల లెక్కింపు లో అక్రమాలు జరిగాయంటూ ప్రస్తుతం కోర్టుల చుట్టూ  తిరుగుతున్నారు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో నే ట్రంప్ కి  కోర్టులు  కూడా వరుస గా షాకులు ఇస్తూనే ఉన్నాయి. దీంతో విధం చెడ్డా ఫలితం దక్కలేదు అన్న విధంగా మారి పోయింది ప్రస్తుతం పరిస్థితి. ట్రంప్ పై  అందరి విమర్శలు గుప్పించి నప్పటికి కూడా.. ఎన్నికల్లో అవక తవకలు జరిగాయంటూ ప్రస్తుతం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇక జో బైడెన్ విషయం పై రకరకాలైన ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు డోనాల్డ్ ట్రంప్.




 అయితే ఏ రాష్ట్రం లో అయితే ఎన్నికల్లో అవక తవకలు జరిగాయి అంటూ ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించా రో  అక్కడ అసలు విషయం బయట పడింది. 70 లక్షల ఓట్లు ఉన్నటువంటి పెన్సిల్వేనియాలో తనకు ఎక్కువ ఓట్లు వస్తాయని నమ్మకంతో ఉన్నారు ట్రంప్.  కానీ అక్కడ తక్కువ ఓట్లు వచ్చాయి అని తెలియడంతో కోర్టు మెట్లు ఎక్కాడు. కాగా  అక్కడ 71 వేల ఓట్ల మెజారిటీతో  డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ విజయం  సాధించినట్లు.. జో బైడెన్ విజయం పై  అధికారిక ప్రకటన వెలువడింది. ట్రంప్  ఆరోపణలపై  ఎలాంటి ఆధారాలు లేవు అంటూ ట్రంపు ఆరోపణలు కొట్టి పారేసింది కోర్టు,

మరింత సమాచారం తెలుసుకోండి: