మనిషికి ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎటువంటి ఆహారం తీసుకున్న కూడా ఇట్టే అరిగిపోతుంది. కానీ ఏదైనా అస్వస్థత వచ్చినప్పుడు తినాలనే ఆలోచన రాదు. తిన్నా కూడా అది సరిగ్గా జీర్ణం కాక అనేక సమస్యలు వస్తాయి. అయితే ముఖ్యంగా చెప్పాలంటే జ్వరం వచ్చినప్పుడు మాత్రం మనిషి తినలేడు.. జ్వరం అనేది తేలిగ్గా తీసుకొనే జబ్బు కాదు. ఒక్కోసారి ప్రాణాలను కూడా కోల్పోయేలా చేస్తుంది. అందుకే కనీస జాగ్రత్తలు పాటించాలని వైద్యులు అంటున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఆహారం విషయం లో మరి ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం..



త్వరగా జీర్ణం అయ్యే వాటిని తీసుకోవడం మంచిది.. అలా కాదని తింటే ప్రాణాలకు ముప్పు ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా మాంసాహారం.. ఇది తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హానికరమని అంటున్నారు.. నాన్ వెజ్ తీసుకోవడం వల్ల తొందరగా అరగక జీర్ణ సమస్యలు వస్తున్నాయి. అందుకే అసలు తినొద్దని అంటున్నారు..


మద్యపానం, ధూమపానం.. అలవాట్లు ఉన్నవారు జ్వరం వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫీవర్ టైంలో వీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని సహజ యంత్రాగానికి ఆటంకం కలుగుతుంది.



ఇకపోతే జంక్ ఫుడ్స్.. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హానికరమని అంటున్నారు. అయితే ఆయిల్ ఎక్కువగా ఉంటుంది. అందుకే జీర్ణం కాదు. వీటిని తిన్న తర్వాత ఐస్ క్రీమ్ లేదా ఏదైనా డ్రింక్ తీసుకుంటారు..అందుకే జంక్ ఫుడ్స్ జోలికి వెళ్ళకూడదు..



మసాలాలు కూడా జ్వరంతో బాధపడుతున్నవారికి మంచిది కాదు. ఫీవర్ టైంలో మసాలాలు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ వాపు వచ్చే ప్రమాదం ఉంది. జ్వరం అనేది ఒక రకమైన ఇన్ఫెక్షన్ లాంటిది.. వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

వీటితో పాటుగా పాల సంభందిత వస్తువులను తీసు కోకూడదు.. జ్వరం వచ్చినప్పుడు లైట్ గా ఉన్న ఆహారం తీసుకోవాలి.. అలా చేస్తే జ్వరం త్వరగా తగ్గిపోతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: