ప్రముఖ టాలెంట్ షో ఆఫ్రికా బిజినెస్ హీరోస్ ఫైనల్లో జాక్ మా జడ్జిగా పాల్గొనాల్సి ఉంది. అయితే ఆ షో నిర్వాహకులు తయ వెబ్సైట్నుంచి జాక్ మా ఫొటోలను తొలగించారు. దీంతో జాక్ మా ఏ మయ్యారనేది మిస్టరీగా మారింది. ఏ విషయమైనా చాలా రహస్యంగా జరిగే చైనాలో... ప్రస్తుతం నడుతున్న అంతుచిక్కని పరిణామాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.చైనా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తే వాళ్లలో జాక్ మా కూడా ఒకరు. ఈ క్రమంలోనే చైనా తీసుకొచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్కరణలపై జాక్ మా విమర్శలు చేశారు. ఆ సంస్కరణలు అవి వృద్ధ విధానాలని, వాటి వల్ల వివిధ వ్యాపార నష్టపోతాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు జాక్ మా. జాక్ మా విమర్శలపై చైనా ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో అక్టోబర్ తర్వాత ఆయన వ్యాపారాలు భారీగా నష్టాలను చవిచూస్తున్నాయి.
యాంట్, అలీబాబా సంస్థల అధిపతిగా జాక్ మా... చైనాలో అత్యధిక సంపద గల వాళ్లలో రెండో స్థానంలో ఉన్నారు. చైనా ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేసిన జాక్ మా... అక్కడి బ్యాంకింగ్ విధానాలపై మండిపడ్డారు. బ్యాంకుల్లో సంస్కరణలు తేవడం లేదని, బ్యాంకులను తాకట్టు దుకాణాల్లా నడుపుతున్నారని ఆరోపించారు. తర్వాత సీన్ మారిపోయింది. భారత కరెన్సీ ప్రకారం ఆయన సంస్థలు ఈ మధ్య కాలంలో 83వేల కోట్ల రూపాయలు నష్టపోయాయి. అలాగే జాక్‌మా సంస్థ యాంట్ గ్రూప్‌నకు దక్కాల్సిన ఓ పబ్లిక్ప్రాజెక్టును చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆదేశాలతో నిలిపివేశారు బీజింగ్ అధికారులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి