బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు శుభవార్త. ఇక సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ప్రకటించింది భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్-బీఎస్ఎన్ఎల్. 365 రోజులకు రూ.365 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రకటించింది. అంటే ఒక రోజుకు రూ.1 చొప్పున 365 రోజులకు రూ.365 చెల్లిస్తే చాలు. రూ.365 రీఛార్జ్ చేసినవారికి అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ రోజుకు 250 నిమిషాలు వస్తాయి. రోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. అంతేకాదు రోజూ 100 ఎస్ఎంఎస్‌లు కూడా వాడుకోవచ్చు. అయితే ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఉంది.

ఈ బెనిఫిట్స్ అన్నీ కేవలం 60 రోజులు మాత్రమే. అంటే 60 రోజులు మాత్రమే వాయిస్, డేటా, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ పొందొచ్చు. ఒకసారి ఫ్రీ వాయిస్ కాల్ లిమిట్ ముగిసిన తర్వాత బేస్ ప్లాన్ టారిఫ్ ప్రకారం ఛార్జీలు ఉంటాయి. ఇక 2జీబీ డేటా వాడుకున్న తర్వాత స్పీడ్ 80కేబీపీఎస్‌కు తగ్గుతుంది. పర్సనలైజ్డ్ రింగ్ బ్యాక్ టోన్ ఆఫర్ కూడా ఉంది. మొదట ఈ ప్లాన్‌ను కేరళలో ప్రకటించింది బీఎస్ఎన్ఎల్. ఆ తర్వాత మరికొన్ని రాష్ట్రాల్లో అందిస్తోంది.

అందులో ఆంధ్రప్రదేశ్ సర్కిల్ కూడా ఉంది. అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని యూజర్లు ఈ ప్లాన్ ఉపయోగించుకోవచ్చు. రూ.365 ప్లాన్‌తో పాటు రూ.2,399 ప్లాన్‌ను కూడా ప్రకటించింది బీఎస్ఎన్ఎల్. రూ.2,399 రీఛార్జ్ చేస్తే రోజూ 250 నిమిషాలు వాయిస్ కాల్స్, 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. ఎలాంటి డేటా లభించదు. డేటా అవసరం లేదనుకునేవారికి ఇది బెస్ట్ ప్లాన్. ఇక రూ.1499 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 365 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ ఫ్రీ వాయిస్ కాల్స్ వస్తాయి. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. 24 జీబీ డేటా వస్తుంది.

ఇక ఇప్పటికే 100 రోజుల వేలిడిటీతో రూ.106, రూ.107 ప్లాన్స్‌ని కూడా ప్రకటించింది బీఎస్ఎన్ఎల్. రూ.106 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 100 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 100 నిమిషాల వాయిస్ కాల్స్ లభిస్తాయి. 3జీబీ డేటా వాడుకోవచ్చు. బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్ 60 రోజులు ఉచితం.  రూ.107 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 100 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 100 నిమిషాల వాయిస్ కాల్స్ లభిస్తాయి. 3జీబీ డేటా వాడుకోవచ్చు. బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్ 60 రోజులు ఉచితం. ఇక బీఎస్ఎన్ఎల్ ఇటీవల రూ.399 ఘర్ వాపసీ పోస్ట్ పెయిడ్ ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్‌లో నెలకు 70 జీబీ డేటా లభిస్తుంది. రోల్ ఓవర్ ఫెసిలిటీ ద్వారా 210జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: